YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కృష్ణా తీరంలో మరో రెండు ఐల్యాండ్

కృష్ణా తీరంలో  మరో రెండు ఐల్యాండ్
కృష్ణా నదీ తీరంలోని దీవుల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ బాధ్యతలను అంతర్జాతీయ సంస్థ స్టూడియోపాడ్ దక్కించుకుంది. భవానీ ఐలాండ్, శాండ్ ఐలాండ్, ప్లాంటేషన్ ఐలాండ్ ను పర్యాటకంగా అభివృద్ధి చేయటానికి తగిన ప్రణాళికలతో కూడిన మాస్టర్ ప్లాన్ కు రూపకల్పన చేసేందుకు స్టూడియోపాడ్ సంస్థతో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. రెండు నెలల్లో ఈ సంస్థ మాస్టర్ ప్లాన్ అందచేయాల్సి ఉంటుంది.స్టూడియోపాడ్ అనేది మన దేశానికి చెందిన అంతర్జాతీయ సంస్థ. అయితే, ఈ సంస్థ అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకాభివృద్ధికి ప్రణాళికలు నిర్దేశిస్తుంది. అమెరికా దేశ భాగస్వామ్యంతో ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి ప్రణాళికలకు రూపకల్పన చేస్తుంటుంది. కృష్ణా నదిలోని దీవుల అభివృద్ధికి ఏపీటీడీసీ టెండర్లను పిలిచింది. ఈ క్రమంలో అర్హతలు, ప్రామాణికాల ఆధారంగా స్టూడియోపాడ్ ను ఎంపిక చేశారు.స్టూడియోపాడ్ సంస్థ ఏమేమి చేయాల్సి ఉంటుందన్న దాని పై ఏపీటీడీసీ అధికారులు ఆర్ఎఫ్పీని విడుదల చేశారు. ఈ ఆర్ఎఫ్పీని అధ్యయనం చేసిన స్టూడియోపాడ్ సంస్థ ఏపీటీడీసీతో ఒప్పందం కుదుర్చుకుంది. ముందుగా భవానీ ద్వీపం పై దృష్టిసారిస్తుంది. భవానీ ద్వీపం భౌగోళిక స్వరూపం, కృష్ణానది, శతాబ్దాలనాటి వరదల చరిత్ర వీటన్నింటినీ అధ్యయనం చేసి ఒక నివేదికను అందిస్తుంది. ఈ నివేదిక ప్రకారం భవానీ ద్వీపంలో నిర్మాణాత్మక అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రతిపాదనలు తయారుచేస్తుంది.అన్ని దీవులకు ఇదే విధానాన్ని అనుసరిస్తుంది. తొలి దశలో పర్యాటకాభివృద్ధి సంస్థ, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా భవానీ ఐల్యాండ్ కే ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఇప్పటికే భవానీ ఐల్యాండ్ ను దాదాపుగా రూ. 4 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేస్తున్నారు. భవానీ ద్వీపాన్ని ఓ ఫిలిం సిటీ లాగ అభివృద్ధి చేయటానికి అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని బ్యూటిఫికేషన్ చేపడుతున్నారు. చూడ చక్కటి ఆర్కిటెక్ట్, అద్భుతమైన ల్యాండ్స్కేపింగ్స్ ఆవిష్క రించే ప్రతిపాదనలు చేయనున్నారు.వీటితో పాటు భవానీ ద్వీపాన్ని సింగపూర్ లోని సెంతోసా తరహాలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సెంతోసాను మించి ఏ విధంగా పర్యాటకంగా అభివృద్ధి చేయవచ్చన్న దాని పై తగిన ప్రణాలికలను నిర్దేశించనుంది. పర్యాటకం, ఆనందం, ఉత్కంఠ, వినోదం, ఆహ్లాదం, ఆటవిడుపు, ఆహారం వంటి అంశాలతో సుందరీకరించే విధంగా నివేదికలు ఇవ్వనుంది. భవానీ ఐలాండ్ లో ఇప్పటికే అంతార్జాతీయ స్థాయిలో లేజర్ మ్యూజిక్ ఫౌంటెయన్ వంటివి ఏర్పాటు చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.భవానీ ఐలాండ్ పక్కన పెడితే మిగిలిన దీవులైన శాండ్ ఐలాండ్, ప్లాంటేషన్ ఐలాండ్ కు, సంబంధించి వాటి భౌగోళిక పరిస్థితుల ఆధారంగా అభివృద్ధి ప్రణాళికలను నిర్దేశించనుంది.

Related Posts