ఇటీవల చోటుచేసుకున్న భీమా-కోరెగావ్ అల్లర్లను ఆధ్యాత్మికవేత్త దలైలామా తీవ్రంగా ఖండించారు. ఇతర మతాలకు వ్యతిరేకంగా ప్రజలను ఉసిగొల్పడం మంచిది కాదని హితవు పలికారు. దలైలామా ఇవాళ పూణెలో మాట్లాడుతూ... ‘‘మతం అనేది వ్యక్తిగత విషయం. మనం హిందువులం, మనం ముస్లింలం అంటూ ప్రజలను రెచ్చగొట్టడం తప్పు. కోపానికి ఏమి విలువ ఉంది? ఉద్రేకపడడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఎంత ప్రశాంతమైన మనస్సు ఉంటే అంత మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది...’’ అని పేర్కొన్నారు. ప్రాచీన భారత జ్ఞానాన్ని భారతీయులు పునరుద్ధరించాలని దలైలామా పిలుపునిచ్చారు.భారత్ అత్యంత శక్తివంతమైన దేశమనీ.. ప్రపంచానికి అత్యావశ్యకమైన పురాతన, ఆధునిక జ్ఞానం భారత్ సొంతమన్నారు. గతంలో ఇదే మాదిరిగా స్పందించిన ఈ బౌద్ధ గురువు... దేశంలోని ప్రాచీన జ్ఞానాన్ని విస్మరించి భారతదేశం పాశ్చాత్య సంస్కృతి వైపు వెళుతోందని పేర్కొన్నారు