కేంద్రం పై రాజీలేని పోరాటం చేస్తోంది ఒక్క టీడీపీ నే. విభజన హామీల ను నెరవేర్చడములో కేంద్రం విఫలం అయిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు.కు ఎందుకు అభ్యంతరం అని .కేంద్రం ను అడుగుతున్నా. ఉక్కు పరిశ్రమ వస్తే నిరుద్యోగ సమస్య తీరుతుంది. కడప ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినాదించారు. కడప సంకల్పం ఉక్కు సంకల్పం తో ముందుకు పోదాం. కేంద్రం ఎందుకు వెనుక బడిన జిల్లా కడప కు నిర్లక్ష్యం చేస్తుందని అన్నారు. ఇప్పడు కొత్తగా గాలి జనార్ధన్ రెడ్డి మాట్లడుతున్నారు.. ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తా అని.. గతం లో రాజశేఖర్ రెడ్డి హయంలో బ్రాహ్మణి స్టీల్ అని చెప్పి దోచుకున్నారు. అవినీతి సొమ్ము తో వచ్చిన వారు జైలు కు వెళ్లివచ్చారు. కేంద్రం రాష్ట్రం పై నాటకాలాడుతోంది. విభజన హామీల పై కేంద్రంతో రాజీలేని ధర్మ పోరాటం చేస్తున్నామని అన్నారు. కడప జిల్లాకు ఉక్కు ఫ్యాక్టరీ రావాల్సిందే. 11 రోజులుగా సియం రమేష్ దీక్ష చేస్తుంటే బిజెపి, వైసీపీ నాయకులు విడ్డురంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. వెనుకబడిన జిల్లా కడప.. అందుకే కడప జిల్లాను అభివృద్ధి చేసే వరకు వదలనని అన్నారు. రాయలసీమ ను రతనాల సీమగా తయారు చేస్తా. కట్టుబట్ల తో బయటకు వచ్చిన మనం ఇప్పుడిప్పుడే అభివృద్ధి దిశలో వెళ్తున్నాం. ఒక పక్క జగన్, మరో పక్క పవన్ ను పెట్టుకొని బీజేపీ వారు డ్రామాలడుతున్నారని అయన విమర్శించారు.