- ధర్మశాస్త్ర_నియమాలు:
ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే చాలమంది పంచాంగకర్తలు దీనిని "సంపూర్ణచంద్రగ్రహణమ"ని తమతమ పంచాంగాలలో వ్రాసారు. ఇంకొంతమంది "గ్రస్తోదయ సంపూర్ణ చంద్రగ్రహణం" అని వ్రాసారు. కొంతమంది పంచాంగకర్తలు మాత్రం కేవలం "గ్రస్తోదయ చంద్రగ్రహణం" అని వ్రాసారు. ఆద్యంత పుణ్యకాలం కూడా 3గం.23ని.లు అని తప్పుగా వ్రాసారు.
ఇంతకీఇదిఏ_గ్రహణం?
గ్రహణ స్పర్శ IST టైమ్ 5:18 pm.
ఎవరికైతే చంద్రోదయం ఆ సమయానికి అవుతుందో వారికి మాత్రమే ఇది సంపూర్ణ చంద్ర గ్రహణ మని రాయాలి. స్పర్శ తరువాత చంద్రోదయ మయ్యేవారికందరికీ ఇది #గ్రస్తోదయసంపూర్ణగ్రహణమే. అలాగే ఆద్యంతపుణ్యకాలం కూడా దర్శనం బట్టే ఉంటుంది. ఆద్యంతపుణ్యకాలం 3 గం.23 ని.లని తప్పుగా వ్రాసారు.
#చంద్రసూర్యోపరాగేతుయావత్దర్శనగోచరః అన్న జాబాలి వచనానుసారం ఆద్యంత పుణ్యకాలం ప్రదేశాన్ని బట్టి మారుతుంది. ఉదాహరణకు రాజమండ్రి విషయం చూద్దాం. రాజమండ్రిలో చంద్రోదయం సా.గం.5.52ని.లు. కాబట్టి ఇది రాజమండ్రికి ఇది గ్రస్తోదయగ్రహణం. గ్రహణమోక్షం రా.గం.8.41 ని. కాబట్టి రాజమండ్రికి ఆద్యంతపుణ్యకాలం 2గం.36ని.లు.మాత్రమే ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన పట్టణాలలో #చంద్రోదయాన్ని అనుసరించి గ్రహణ ప్రారంభసమయాలు ఇలా ఉన్నాయి.
1.#హైద్రాబాద్: 18:05hrs to 20:41. కావున ఆద్యంత పుణ్యకాలం : 2hr.36 min
2.#రాజమండ్రి: 17:52 to 20:41 ఆద్యంతపుణ్యకాలం : 2 hr 49 min
3.#విజయవాడ : 17:58 to 20:41
ఆద్యంతపుణ్యకాలం : 2 hr 43 min
4.#తిరుపతి : 18:06 to 20:41
ఆద్యంతపుణ్యకాలం : 2hr 35 min
5. #విశాఖపట్నం : 17:45 to 20:41
ఆద్యంతపుణ్యకాలం : 2hr 56 min
6. #కాకినాడ : 17:50 to 20:41
ఆద్యంతపుణ్యకాలం: 2hr51 min.
#ఆరోజుపగలంతాభోజనం_చేయరాదు.
"గ్రస్తోదయే విధోః పూర్వం నాహర్భోజనమాచరేత్" అన్న వృద్ధవాసిష్ఠ వచనాన్ని విద్యారణ్యులు తమ కాలమాధవం లో ఉటంకించారు. విద్యారణ్యులు తన మాటగా , "పాపక్షయకామో గ్రహణదినముపవసేత్ " అని వ్రాసారు. అందువల్ల పాపక్షయం కోరుకునేవారంతా ఆరోజంతా ఉపవాసముండాలి. ఇక మనువు చెప్పిన #చంద్రసూర్యగ్రహే నాద్యాదద్యాత్స్నాత్వా విముక్తయోః
అన్న వాక్యానుసారం రాత్రి గ్రహణ మోక్షానంతరం స్నానం చేసి శుద్ధబింబాన్ని చూసి భోజనం చేయవచ్చును.
ఇక ఈ #గ్రహణఫలితాలు వివిధరాశులలో జన్మించిన వారిపై ఎలా ఉంటాయి?
"త్రిషడ్దశాయేషుపగతం నరాణాం
శుభప్రదం స్యాద్గ్రహణం రవీంద్వోః
ద్విసప్తనందేషు మధ్యమంస్యాత్
శేషేష్వనిష్టం కథితం మునీంద్రైః"
అనగా జన్మరాశినుండి 3,6,10,11 రాశులలో గ్రహణం శుభం. 2,7,9 లయందు మధ్యమం. మిగలిన రాశులయందు అనగా 1,4,5,8,12 అశుభం. ప్రస్తుతం కర్కటకరాశి యందు గ్రహణం కావున కర్కటక,ధను,మీన, మేష,సింహ రాశులవారికి అశుభం. వారు బింబదానం చేసుకోవాలని శాస్త్రం తెలియజేస్తోంది.
#బింబదానం అంటే ?
వెండి చంద్రుడు, వెండి రాహువు,
బంగారు/వెండి సూర్యుడిని ( అశక్తులైనవారు పిండితో చేసిన వాటిని) రాగిపాత్రలో ఆవునేయి వేసి, వీటిని అందులో ముంచి ఆయా గ్రహాలకు పూజచేసి దోషాన్ని సంకల్పంలో చెప్పి అనంతరం వాటినన్నింటిని వస్త్రదక్షిణాదిసహితంగా బ్రాహ్మణునకు దానమీయాలి. గ్రహణానంతరం ఎంత త్వరగా ఈ దానం చేసుకుంటే అంత మంచిది.
వివిధరాశులవారిపై ఫలితాలు జ్యోతిష గ్రంథాలలో ఇలా ఉన్నాయి.
1. మేషం : శరీరపీడ
2. వృషభం : ధనలాభం
3. మిథునం : నష్టం
4. కర్కటకం : తీవ్రగాయాలు,నష్టాలు
5. సింహం : హాని
6. కన్య : లాభం
7. తుల : సుఖం
8. వృశ్చికం : గౌరవభంగం
9. ధనుస్సు : తీవ్ర అనారోగ్యం
10. మకరం : భార్యకు కష్టం (లేదా) స్త్రీల మూలంగా ఇబ్బందులు.
11.కుంభం : సౌఖ్యమ్
12. మీనం : దిగులు.
నేను నిన్ననే ఈ గ్రహణఫలితాలు పోస్ట్ చేసాను. అపుడు కొంతమంది ఇవన్నీ చెప్పి ప్రజలను భయపెట్టడం భావ్యమా? అని కామెంట్ చేసారు. వారికి నా సమాధానం :
మన మహర్షులు ఈ ఫలితాలను మనలను భయపెట్టే ఉద్దేశ్యంతో తెలుపలేదు. ప్రారబ్ధాన్ని దైవపూజ,దానము ఇత్యాది పురుషప్రయత్నా లద్వారా నివారణ లేక ఉపశమనం పొందవచ్చన్న గొప్ప సత్యాన్ని అందివ్వటమే వారి ఆశయం. కనుక ఆ విషయాన్ని మీ ముందు ఉంచటం జరిగింది.
ఇక అసలు #గ్రస్తోదయం అన్న విషయం తమ తమ పంచాంగాలలో రాయకుండా , ఆద్యంతపుణ్యకాలం లో కూడా తప్పులు చేస్తూ చాలామంది పంచాంగకర్తలు ప్రజలను తప్పుదోవ పట్టించటమనేది క్షమార్హం కాదు. అయితే నేను పరిశీలించిన పంచాంగాలలో
1. బుట్టే వీరభద్ర దైవజ్ఞ గారు
2. రేలంగి తంగిరాలవారు
3. నారాకోడూరు వంంగివరపు వారు
4. రావులపాలెం లోని దేవరభొట్ల సురవర్ధనశర్మగారు
తమ తమ పంచాంగాలలో గ్రస్తోదయాన్ని ఉటంకించారు. వారంతా అభినందనీయులే.
ఇక ముఖ్యంగా గవర్నమెంటు పంచాంగాల వారంతా దృక్సిద్ధ పంచాంగాలంటూ ఆ దృక్ ని గ్రహణవిషయంలో ప్రదేశానుసారం మార్పుని పాటించకుండా ఒకేమూసలో పోసినట్టు దేశమంతా ఒకే తిథి వ్రాస్తూ , ఆద్యంత పుణ్యకాలం అనేది చంద్రదర్శనం తోనే ప్రారంభమన్న విషయం మరిచో లేక తెలియకో పొరపాటు చేసారు.
ఇక గ్రహణపుణ్యకాలంలో చేయకూడనివి.
1. నిద్ర,భోజనం,మలమూత్ర విసర్జన, స్త్రీసహవాసము కూడవు.
2. గ్రహణానికి ముందు వండిన పదార్థాలు గ్రహణానంతరం తినకూడదు.
అయితే, గ్రహణానికి ముందు ఉన్న నూనె పదార్థాలు, గంజి, మజ్జిగ, అలాగే ముందు నూనె/నెయ్యి తో వండిన పదార్థాలు పనిచేస్తాయి. అలాగే బాల, వృద్ధ, గర్భిణులు మధ్యాహ్నం వరకూ ( ద్వితీయ యామాంతం) ఆహారం తీసికొనవచ్చును.