కడపలో ఉక్కు పరిశ్రమ సాధన కోసం ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న టీడీపీ ఎంపీ సి.ఎం.రమేష్ ను లోకేశ్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగేళ్లుగా టీడీపీ ప్రభుత్వం ఓపిక పట్టిందన్నారు. ఉక్కు పరిశ్రమ ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం అని, కేంద్ర ప్రభుత్వాన్ని ఏనాడైనా వైసీపీ నేతలు అడిగారా? అని ప్రశ్నించారు. సీఎంను విమర్శించడం మాని కేంద్రాన్ని ప్రశ్నించాలని సూచించారు. సొంత జిల్లాకు ఎందుకు అన్యాయం చేస్తున్నారని జగన్ను ప్రశ్నిస్తున్నానని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ఎంపీలు రాష్ట్ర హక్కుల సాధన కోసం ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. కడప జిల్లా ప్రజల ఆశలు నెరవేర్చాలి అని సిఎం రమేష్ ఉక్కు మనిషిగా మారారు. 11 రోజులుగా అయన చేస్తున్న దీక్షకు కేంద్ర ప్రభుత్వం వణుకుతుంది. ఒక పక్క మనం కేంద్రంతో పోరాడుతుంటే ఇక్కడ ప్రతిపక్షాలు, బీజేపీ నాయకులు మన పై ఆరోపణలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం షెడ్యూల్ 13 లో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తాం అని 6 నెలల్లో సెయిల్ ద్వారా నివేదిక ఇవ్వాలని స్పష్టంగా ఉంది...కానీ నాలుగు ఏళ్లు అయినా కేంద్రంలో కదలిక లేదని అన్నారు. ఆఖరికి బీజేపీ కుట్ర రాజకీయానికి పరాకాష్ట... ఉక్కు ఫ్యాక్టరీకి ఫిజిబిలిటీ లేదు అని సుప్రీం కోర్టు లో అఫిడవిట్ దాఖలు చేసింది. గతంలో ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యమేనని మెకాన్ సంస్థ నివేదిక ఇచ్చింది...దానిని చెత్త బుట్ట లో వేసి కేంద్రం కడప ప్రజల గుండెల పై తన్నిందని అన్నారు. స్టీల్ ఫ్యాక్టరీ ఇచ్చేదే లేదు అంటున్నా దొంగ అబ్బాయి...420 ఎందుకు మాట్లాడటం లేదు...బీజేపీ నేతల నోరు ఎందుకు మూగబోయింది. ప్రశ్నిస్తా అన్న పవన్ కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదని అన్నారు. కడప ఫ్యాక్టరీ పేరుతో గాలి,జగన్ బ్యాచ్ పెద్ద ఎత్తున డబ్బులు కొట్టేసారని ఆరోపించారు.