జంట నగరాలు రెండు నిమిషాలపాటు నిలిచిపోయాయి. గాంధీ వర్ధంతి సందర్భంగా రెండు నిమిషాల పాటు మౌనం పాటించాలన్న ప్రభుత్వం ఆదేశాలను ప్రజలు స్వచ్ఛందంగా పాటించారు.
మంగళవారం ఉదయం 11 గంటల నుంచి 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఆ సమయంలో రహదార్లపై వాహన రాకపోకలను అధికారులు ఎక్కడికక్కడే నిలిపివేశారు. ఆ సమయంలో వాహనదారులు హారన్లు కూడా మోగించలేదు. పాదాచారులు కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరోకొన్ని చోట్ల కూడా విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు, చిరు వ్యాపారస్థులు, ఇలా అన్ని వర్గాల ప్రజలు మౌనం పాటించినట్లు తెలుస్తోంది.