ఓం నమో వేంకటేశాయ!!
• ఈ రొజు బుదవారం
31.01.2018
ఉ!! 5 గంటల సమయానికి,
• నిన్న 62,424 మంది
భక్తులకు స్వామివారి దర్శన
భాగ్యం కలిగినది.
• స్వామి దర్శనం కోసం 02
కంపార్ట్మెంట్స్ లో భక్తులు
వేచి ఉన్నారు.
• నిన్న స్వామివారికి హుండీలో
భక్తులు సమర్పించిన నగదు
₹:2.96 కోట్లు.
• నిన్న 18,960 మంది
భక్తులు స్వామివారికి
తలనీలాలు సమర్పించి
మొక్కు చెల్లించుకున్నారు.
నేడు చంద్రగ్రహణం
• ఈరొజు చంద్రగ్రహణం
కారణంగా ఉ: 11 గంటల
నుంచి రాత్రి 9.30 గంటల
వరకు శ్రీవారి ఆలయ
తలుపులు
మూసివుంచనున్నారు.
• ఈరొజు 5.18 గంటలకు
చంద్రగ్రహణం ప్రారంభమై
రాత్రి 8.41 గంటలకు
పూర్తవుతుంది.
• గ్రహణం కారణంగా ₹: 300/-
ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లు,
దివ్యదర్శనం టోకెన్లు,
వృద్ధులు, దివ్యాంగులు,
చంటిపిల్లల తల్లిదండ్రులు
మరియు ప్రత్యేక ప్రవేశ
దర్శనాలు రద్దు.
• ఈరొజు ఆర్జిత సేవలు సహస్ర
కలశాభిషేకం, కల్యాణోత్సవం
ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం,
వసంతోత్సవం, సహస్ర
దీపాలంకారణ సేవలు,
పౌర్ణమి గరుడసేవ కూడా
రద్దు చేశారు.
(ఈరొజు శ్రీవారి ఆలయం ఉదయం, రాత్రి కలిపి దాదాపు 5 గంటల పాటు మాత్రమే తెరిచి ఉంటుందని, భక్తులు ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని తమ తిరుమల యాత్రను సాగించాలని టిటిడి కోరుతోంది)
శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం
!!కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే
ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్ !!
తా: కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా! తూర్పు తెల్లవారుచున్నది. దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది. కావున లెమ్ము
ttd toll free#
18004254141
ttd whatsapp#
+919399399399