షూటింగుకి వెళ్లడం అంటే స్కూలుకి వెళ్లడంగా తాను భావిస్తానని అంటోంది కథానాయిక అనుపమా పరమేశ్వరన్. "ఈ షూటింగ్ వాతావరణం నాకు చాలా ఇష్టం. ఒక స్కూలుగా దీనిని భావిస్తూ ప్రతి రోజూ ఏదో ఒక కొత్త విషయం తెలుసుకుంటున్నాను. ఇక్కడ బోలెడు మంది స్నేహితుల్ని కూడా సంపాదించుకున్నాను" అని చెప్పింది ఈ ముద్దుగుమ్మ.