YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కేసీఆర్ బాటలో పవన్ కళ్యాణ్

కేసీఆర్ బాటలో పవన్ కళ్యాణ్
జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొద్దిరోజులుగా త‌న రూటు మార్చుకున్నారు. కొద్దిరోజులుగా కొత్తరాగం ఎత్తుకుంటున్నారు. అదే వేర్పాటు వాదం.. ఇందుకు ఆయ‌న ఉత్తరాంధ్రను ఎంచుకుని ముందుకు వెళ్తున్నారు. అయితే.. ఓవైపు ఏపీ ప్రజ‌లు విభ‌జ‌న చ‌ట్టంలోని అంశాల‌ను అమ‌లు చేయాల‌నీ, ఏపీకి ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకోవాల‌ని కేంద్రంపై ఉద్యమిస్తున్న వేళ‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇందుకు భిన్నంగా ప్రజ‌ల్లోకి వెళ్తున్నారు. ఉత్తరాంధ్రలో ఆయ‌న ప్రజాపోరాట యాత్ర పేరుతో కొన్ని రోజులుగా ఆయ‌న ప‌ర్యటిస్తున్నారు. విశాఖ‌ప‌ట్నంలో ప‌ర్యటిస్తున్న ఆయ‌న అక్కడ కూడా ఇదే విష‌యాన్ని ప్రస్తావిస్తూ ముందుకు వెళ్తున్నారు. మొత్తంగా పాల‌కులు ఉత్తరాంధ్రుల ప‌ట్ల వివ‌క్ష చూపుతున్నార‌నే విష‌యాన్ని జ‌నంలోకి తీసుకెళ్లి వారిని ఆక‌ట్టుకోవ‌డానికి ఆయ‌న ప్రయ‌త్నం చేస్తున్నారు. అభివృద్ధి ఒకేచోట కేంద్రీకృతమయితే దాని పరిణామాలు ఎలా ఉంటాయో రాష్ట్ర విభజన తెలియజేసిందని, టీడీపీ ప్రభుత్వం నవ్యాంధ్రలోనూ ఇదే విధానాలను అవలంబిస్తుండటం కలచివేస్తోందని అన్నారు.స్థానికులకు అభివృద్ధిలో చోటు కల్పించకపోతే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఇలా ప్రాంతీయ అస‌మాన‌త‌ల‌ను తెర‌పైకి తెస్తున్నారు. ఇక ప‌వ‌న్ తోడుగా.. సీపీఐ, సీపీఎంలు క‌లిసిన‌డుస్తున్నాయి. సీపీఎం రాష్ట్ర కార్యద‌ర్శి మ‌ధు మాట్లాడుతూ.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీలో త్రిముఖ పోరు ఉంటుంద‌నీ, అది జ‌న‌సేన‌, వైసీపీ, టీడీపీల మ‌ధ్యే ఉంటుంద‌ని అన్నారు. ఏదేమైనా ప‌వ‌న్ త‌న రాజ‌కీయ బ‌లాబ‌లాల‌ను అంచ‌నా వేసుకుని స‌రికొత్త పంథాలో ముందుకు వెళుతున్నారు. ఇవి ఎన్నిక‌ల వేళ ఆయ‌న‌కు ఎంత వ‌ర‌కు మైలేజ్ ఇస్తాయో ? చూడాలి.ఏపీలో ఎన్నిక‌ల హీట్ స్టార్ట్ అవ్వడంతో చంద్రబాబు ఎక్కడికక్కడ స‌ద‌స్సుల పేరుతో ప్రజ‌ల్లో ఉంటుంటే, వైసీపీ అధినేత జ‌గ‌న్ ప్రజాసంక‌ల్ప యాత్ర పేరుతో ఆరు నెల‌లుగా ప్రజ‌ల్లోనే ఉన్నారు.ఇక జ‌న‌సేన అధినేత జ‌గ‌న్ ప్రజాపోరాట యాత్ర అంటూ నెల రోజులుగా ఉత్తరాంధ్రలోనే తిరుగుతున్నారు. అయితే.. ఇక్కడ కేవ‌లం స్థానిక అంశాల‌ను దృష్టిలో పెట్టుకుని ప్రజ‌ల్ని ఆక‌ట్టుకోవ‌డానికి ప్రయ‌త్నం చేస్తున్నారు. వేర్పాటు వాదాన్ని ముందుకు తీసుకొచ్చి వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాజ‌కీయంగా ల‌బ్ధిపొందాల‌న్నదే ప‌వ‌న్ టార్గెట్‌గా క‌నిపిస్తోంద‌ని ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. నిజానికి.. శ్రీ‌కాకుళం జిల్లా నుంచి ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప్రజాపోరాట‌యాత్ర చేప‌ట్టారు. ఇక్కడ ప‌వ‌న్ త‌రుచూ వినిపిస్తున్న మాట ఏమిటంటే.. ఉత్తరాంధ్ర వెన‌క‌బ‌డిన ప్రాంతం కాద‌నీ, వెన‌క‌బ‌డేసిన ప్రాంత‌మ‌ని, ఇలాగే కొన‌సాగితే.. ప్రజ‌ల్లో వేర్పాటు వాదం ముందుకు వ‌స్తుంద‌ని ఆయ‌న ప‌దేప‌దే చెబుతున్నారు.ఉమ్మడి రాష్ట్రంలోనూ తెలంగాణ విష‌యంలో ఇదే జ‌రిగింద‌ని ఆయ‌న చెప్పుకొస్తున్నారు. ఇందులో భాగంగానే ఉద్దానంలో కిడ్నీవ్యాధుల బారినప‌డిన వారిని ఆదుకోవాల‌ని ఆయ‌న దీక్ష కూడా చేప‌ట్టారు. పాల‌కులంద‌రూ ఉత్తరాంధ్రను పట్టించుకోవ‌డం లేద‌నీ, స్థానికుల‌కు ఉపాధి, ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పించ‌డంలో విఫ‌లం చెందార‌ని ఆయ‌న ఆరోపిస్తున్నారు. అంతేగానీ.. ఎక్కడ కూడా పెద్దగా విభ‌జ‌న చ‌ట్టంలోని అంశాల‌ను ప్రస్తావించ‌డం లేదు. ఉత్తరాంధ్రులు అన్ని రంగాల్లో వెనుకబడ్డారని, వారికి పెద్దపీట వేయాల్సి పవన్ చెపుతున్నారు. ఇలా ప్రాంతీయ వాదాన్ని త‌ల‌కెత్తుకోవ‌డం ద్వారా టీఆర్ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్ రూటులో ప‌వ‌న్ ప‌య‌నిస్తున్నార‌నే టాక్ వినిపిస్తోంది

Related Posts