తిరుమల: వయోవృద్ధులకు శ్రీ వేంకటేశ్వర స్వామి ఉచిత దర్శనం.
ఈ దర్శనానికి రెండు సమయాలున్నాయి:
1. ఉదయం 10కు. తరువాత
2. సాయంత్రం 3కు. .
ఫోటోతో వున్న వయసు నిర్ధారణ పత్రాలు "S-1 counter" వద్ద చూపించాల్సి వుంటుంది.
ఆలయానికి కుడివైపు బ్రిడ్జి కింద గోడ పక్కనే.
మెట్లు ఎక్కాల్సిన పని లేదు. మంచి సీట్లు ఏర్పాటు చేయబడి వుంటాయి. ఉచితంగా సాంబారన్నం, పెరుగన్నం, వేడి పాలు ఇస్తారు... వారికి ₹20/-లకు రెండు లడ్డు టోకెన్లు ఇస్తారు. తరువాత ₹25/- లకు ఒక లడ్డు చొప్పున ఎన్నైనా టోకెన్లు ఇస్తారు. కౌంటరు నుండి గుడికి-గుడి నుండి కౌంటరుకు బ్యాటరీ కారులో ఉచిత ప్రయాణం. వీరి దర్శనం కొరకు మిగతా అన్ని క్యూ లు నిలిపి వేయబడతాయి. ఎటువంటి వత్తిళ్ళు-తోపులాటలు వుండవు. 30 నిమిషాలలో దర్శనం పూర్తి అవుతుంది అని టీటీడీ వారు తెలియజేసారు.