YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

హోం గార్డుల అత్మీయ సభలో సీఎం చంద్రబాబు

హోం గార్డుల అత్మీయ సభలో సీఎం చంద్రబాబు
హోంగార్డులకు త్వరలో ఇళ్లు సమకూరుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. సోమవారం నాడు ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియంలో జరిగిన  హోంగార్డుల ఆత్మీయ అభినందన సభలో చంద్రబాబు మాట్లాడారు. సహజ మరణాలకు కూడా 5 లక్షల రూపాయిలు ఇస్తున్నామని చెప్పారు. మహిళలపై దాడులను అరికట్టడం మన కర్తవ్యమని ఆయన అన్నారు. ఎవరైనా ఆడపిల్లల జోలికొస్తే ఖబడ్దార్ అని ఆయన హెచ్చరించారు. ఎవరైనా  మానభంగం చేస్తే వారికి అదే చివరి రోజు అవుతుందని ఆయన చెప్పారు. పోలీసులు ప్రతినెలా క్రైమ్ బులెటిన్ విడుదల చేయాలని ఆయన సూచించారు. పోలీసులతో సమానంగా ప్రకృతి వైపరీత్యాలు, శాంతి భద్రతల, ట్రాఫిక్ విధుల్లో, నేరపరిశోధన పనుల్లో, బీటు డ్యూటీ సమయంలో విధులు హోంగార్డ్స్ నిర్వహిస్తున్నారని అయన కితాబునిచ్చారు. ఇప్పటి వరకు రోజువారి అందించే దినసరి  భత్యాన్ని రూ.400 నుంచి రూ.600 పెంచుతూ నెలకు రూ.18000  జీతం చెల్లింపు కు ఉత్తర్వులు జారీచేసామని అయన గుర్తు చేసారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ప్రతి ఒక్కరికి 2,50,000 వరకు వైద్య సేవలు, హోం గార్డ్ మరణించిన సమయంలో ఇచ్చే సహాయాన్ని రూ.1000 నుంచి రూ.10 వేలకు పెంచామని అయన అన్నారు. ప్రమాదవశాత్తు గాని, సహజ మరణం గాని సంభవిస్తే ఐదు లక్షలు పరిహారం చెల్లించాలని నిర్ణయించినట్లు అయన అన్నారు. పోలీసు కానిస్టేబుల్ నియామకంలో హోంగార్డు లకు  8 శాతం కోటా అమలు వుంటుందని అయన అన్నారు. అలాగే,  మహిళా హోంగార్డు లకు మూడు నెలల ప్రసూతి సెలవులు ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. 

Related Posts