YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి

సివిల్స్‌-2017 మెయిన్స్‌ ఫలితాలు విడుదల!!

సివిల్స్‌-2017 మెయిన్స్‌ ఫలితాలు విడుదల!!

న్యూఢిల్లీ : సివిల్స్‌-2017 మెయిన్స్‌ ఫలితాలు విడుదలయ్యాయి. యూనియన్‌ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌(యూపీఎస్‌సీ) ఈ ఫలితాలను తన అధికారిక వెబ్‌సైట్లో ప్రకటించింది. గతేడాది అక్టోబర్‌ 28 నుంచి నవంబర్‌ 3 మధ్యలో సివిల్స్‌ మెయిన్స్‌ ఎగ్జామ్‌ జరిగిన సంగతి తెలిసిందే. మూడు స్టేజీల్లో సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామ్‌ను యూపీఎస్‌సీ నిర్వహిస్తోంది. ఒకటి ప్రిలిమినరీ, రెండు మెయిన్స్‌, మూడు ఇంటర్వ్యూ.  

మెయిన్స్‌ ఎగ్జామ్‌ను క్లియర్‌ చేసిన అభ్యర్థుల రోల్‌ నెంబర్లను www.upsc.gov.in పొందుపరిచినట్టు యూపీఎస్‌సీ పేర్కొంది. ఈ ఎగ్జామ్‌లో ఎంపికైన వారికి ఫిబ్రవరి 19 నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించే అవకాశముందని యూపీఎస్‌సీ తెలిపింది. జనవరి 18 నుంచి ఈ వెబ్‌సైట్‌లో ఇంటర్వ్యూ లెటర్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు వయసు, విద్యార్హతల సర్టిఫికేట్లు, కమ్యూనిటీ, ఫిజికల్‌ హ్యాండిక్యాప్‌ వంటి ఇతర ఒరిజనల్‌ డాక్యుమెంట్లను పట్టుకుని రావాల్సి ఉంటుందని యూపీఎస్‌సీ తెలిపింది. క్వాలిఫై కానీ అభ్యర్థుల మార్కు షీట్లను కూడా తుది ఫలితాల వెల్లడి నుంచి 15 రోజుల్లో యూపీఎస్‌సీ తన వెబ్‌సైట్‌లో పెట్టనుంది.

Related Posts