జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలోని సీతమ్మధారలో కార్యాలయాన్ని ప్రారంభించారు. ఉత్తరాంధ్ర సమస్యల పరిష్కారానికి నూతన కార్యాలయం వేదిక కావాలని ఆకాంక్షించారు. ‘‘ అన్ని వనరులు ఉన్నప్పటికీ ఉత్తరాంధ్ర ప్రాంతం వెనుకబడిపోవడానికి పాలకుల నిర్లక్ష్యమే కారణం. దీనికి కారణాలను అన్వేషించడంతోపాటు ఈ ప్రాంత సమస్యలకు పరిష్కారాలు సూచించి, అభివృద్ధికి బాటలు వేసేందుకు ఈ కార్యాలయం వేదిక కావాలి’’ అని పవన్ కల్యాణ్ అన్నారు.