- 900 కాయలు కాచిన మునగ చెట్టు
ఒక మునగ చెట్టుకు వంద కాయలుంటే అరుదని భావిస్తాం. అలాంటిది ఏకంగా 900 కాయలుంటే నిజంగా ఆశ్చర్యమే. కృష్ణా జిల్లా మోపిదేవిలోని ఒక మునగ చెట్టు విరగ్గాసింది. గ్రామానికి చెందిన బెల్లం కొండ కృష్ణమూర్తి పొలంలో ఉన్న ఈ చెట్టుకు నీరు, పశువుల ఎరువు క్రమం తప్పకుండా అందించారు. తొలి ఏడాది 500 కాయలు కాసింది. ప్రస్తుతం ఈ చెట్టుకు 900 కాయలున్నాయి. దీనిపై నందిగామ ఇన్‌ఛార్జి ఉద్యాన అధికారిణి ప్రసన్న లక్ష్మి మాట్లాడుతూ.. నీరు, సేంద్రియ ఎరువు క్రమం తప్పకుండా ఇవ్వడంతో పోషకాలు బాగా అంది ఈ స్థాయిలో కాయలు కాసేందుకు ఆస్కారముందని తెలిపారు