తిరుమల తిరుపతి దేవస్ధానం వివాదం హైకోర్టుకు చేరింది. తిరుమల స్వామి వారి నగలు మాయం, ఆలయం లోపల తవ్వకాలపై సీబీఐతో విచారణ జరిపించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు మూడు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలంటూ టిటిడిని ఆదేశించింది.మొత్తం వ్యవహారంపై సీబీఐ చేత దర్యాప్తు చేయాలని పిటిషనర్ లో పేర్కొన్నారు. గుడి లోపల గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నారని కోర్టు కు పిటిషనర్ తెలిపారు. అయితే,, ఎలాంటి తవ్వకాలు జరపలేదని గుడి లో కొన్ని మరమ్మత్తులు జరిపామని కోర్టు కు టీటీడీ తెలిపింది. ప్రస్తుతం నిర్మిస్తున్న గుడి గోపురం బంగారం కాదని పిటిషనర్ వాదన. ఇప్పుడు చేపడుతున్న దానిలో బంగారం వాడుతున్నామని కోర్టు కు టీటీడీవిన్నవించింది. తిరుమల లో జరుగుతున్న అక్రమాల పై న్యూస్ పేపర్లో వచ్చిన కథనాలను కోర్టుకు సమర్పించారు. సుప్రీంకోర్టు జడ్జ్ మెంట్ ప్రకారం న్యూస్ పేపర్లో వచ్చిన వాటిని కోర్టు పరిగణింలేమని హైకోర్టు స్పష్టం చేసింది. పూర్తి వివరాలతో మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది