ఆంద్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీపై జాతీయ నాయకత్వం దృష్టి సారించిందా? అందుకు తగ్గ విధంగా వుహ్యలకు పదును పెడుతుందా? పార్టీ నుంచి వెళ్లిపోయిన నేతలను తిరిగి పార్టీలోకి తీసుకవచ్చే స్కెచ్ వేస్తుందా? ఇంతకీ పార్టీ బలోపేతం కోసం ఏపీ కాంగ్రెస్ నేతలు ఎలాంటి స్కెచ్ వేస్తున్నారు?...ఏపీలో కాంగ్రెస్ పార్టీకి మళ్లీ పూర్వవైభవం తెస్తాంటున్నారు పార్టీ సీనియర్ నాయకులు. రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్టపోయన పార్టీకి కొత్త జీవం పోస్తామంటున్నారు. పార్టీని విడిచి వెల్లిన పెద్దలను మళ్లీ పార్టీలోనికి ఆహ్వానిస్తున్నారు. రాహుల్ గాంధీ ఆదేశంతో కొత్త చేరికలను ప్రోత్సహిస్తూ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ ఉమెన్ ఛాందీ రంగంలోనికి దిగారు. సమైక్య ఆంధ్రప్రేదశ్ విభజనతో ఏపీలో నామమాత్రపు పార్టీగా మిగిలిన కాంగ్రెస్ పార్టీ మళ్లీ సొంతకాళ్లపై నిలబడే ప్రయత్నం చేస్తోంది. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పై అలిగి వెల్లిన పార్టీ సీనియర్లను మల్లీ పార్టీలోనికి చేర్చుకునే ఎత్తుగడతో కాంగ్రెస్ పార్టీ ఏపీ వ్యవహారాల ఇంచార్జీ ఉమెన్ చాంది మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు. పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ ఆజ్ఞ మేరకు దేశంలో అన్ని రాష్ట్రాల్లో పార్టీని విడిచి వెల్లిన సీనియర్లను పార్టీ పూర్వవైభవం కోసం వాళ్లను మళ్లీ పార్టీలోనికి రావాల్సిందిగా అహ్వానిస్తున్నామని ఉమెన్ చాండీ స్ఫష్టం చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి మళ్లీ పార్టీలోకి వస్తూరనే వార్తలు కూడా జోరుగా వినిపిస్తున్నాయి.మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మళ్లీ పొలిటికల్‌గా యాక్టివ్ అయ్యే ప్రయత్నాల్లో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. గత ఎన్నికల సమయంలో జై సమైక్యాంధ్ర పార్టీ అంటూ వచ్చిన కిరణ్ ఆ తర్వాత కనుమరుగయ్యారు. సొంత పార్టీ ద్వారా సత్తా చాటాలని చూసిన కిరణ్.. ఎక్కడా డిపాజిట్ తెచ్చుకోలేకపోయారు. ఓటమికి కారణాలను విశ్లేషించించడానికి కూడా సమయం కేటాయించలేదు. మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్‌లో కనిపించలేదు. అయితే మళ్లీ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో కిరణ్ రాజకీయంగా యాక్టివ్ కావడానికి ప్రయత్నాలను ముమ్మరం చేశారట. గత ఎన్నికల ముందు కాంగ్రెస్ కు రాజీనామా చేసి సొంత పార్టీ పెట్టుకున్న ఈయన ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్‌లోకి చేరనున్నారట. ఇప్పటికే కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రేస్ పార్టీ పెద్దలతో సమావేశం అయ్యారని... త్వరలోనే అధికారికంగా కాంగ్రెస్ లో చేరడానికి కిరణ్ సిద్ధం అవుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి . ఆదివారం ఇందిరా భవన్‌లో సమావేశమైన ఏపీ కాంగ్రెస్ సీనియరన్లు రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల్లో ఆరు జిల్లాలకు ఒకరు మరో 7 జిల్లాలకు మరో ఇద్దరిని ఇంచార్జీలను నియమించి గ్రామ స్థాయిలో నుంచి అసెంబ్లీ స్థాయి నాయకులతో మమేకం అయి పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై ఓ నిర్ణయానికి వచ్చారు. ఏకంగా పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ జిల్లాల వారీగా పర్యటించాలని తీర్మాణించారు.ఉండవల్లి అరుణ్ కుమార్, వట్టి వసంత కుమార్, ఆనం సహోదరులు, చిరంజీవి, శైలజానాథ్, డొక్కమాణిక్యవర ప్రసాద్, పనబాక లక్ష్మి, బొత్స, కొండ్రు మురళి, పార్థసారథి, బాలరాజు.. వీరంతా కాంగ్రేస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అతిరథ మహారథులుగా చలామణి అయ్యారు. అధిష్టానంతో అనూహ్యంగా సంప్రదింపులు జరుపుతూ, ప్రతిపక్ష నేతల సవాళ్లకు ప్రతిసవాళ్లు విసురుతూ, విభజన ప్రక్రియపై ఏదో ఒక ప్రకటన చేస్తూ తరుచూ మీడియాలో హల్ చల్ చేస్తుండేవారు.ఇంతటి ప్రాచూర్యం సంపాదించిన సదరు నేతలు కొందరు పార్టీని వీడగా మరికొందరు అరణ్యవాసం చేస్తున్నట్టు అసలు ప్రజా జీవితాన్ని పూర్తిగా విస్మరించారు.మొత్తానికి జీవం కొల్పోయిన ఏపీ కాంగ్రెస్ మళ్లీ తన సత్తా చాటుతానంటుంది. ఇందుకోసం పార్టీ పెద్దలు పదే పదే పార్టీ వీడి వెల్లిన బడా నేతలను పార్టీలోనికి ఆహ్వానించి.... జిల్లాల వారీగా ప్రజల్లోనికి వెల్లి బలం పుంజుకుంటానని చేస్తున్న ప్రయత్నాలు పెద్ద నేతలు ఎప్పుడు పార్టీలోనికి వస్తారు.. వారు వచ్చిన తరువాత పార్టీకి మంచి ఫలితాలు వస్తాయా రావా అనేది రానున్న రోజుల్లోనే తేలనుంది.