YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కేంద్రం సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తుండడమే...

కేంద్రం సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తుండడమే...

 ఏపీలో టీడీపీ, బీజేపీ నాయకుల నడుమ మాటల యుద్ధం సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే మొన్నమొన్నటి వరకు సీఎం చంద్రబాబు కూడా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోలేదు. పైపెచ్చు బీజేపీ నాయకులు ఎలాంటి వ్యాఖ్యలు చేసినా మౌనం వహించాలంటూ టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అలాంటి చంద్రబాబునాయుడే సహనం నశించి ఇటీవల బీజేపీ నాయకులనుద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరమైతే బీజేపీతో పొత్తుకు గుడ్‌ బై చెప్పడానికి కూడా వెనకాడనంటూ వ్యాఖ్యానించారు. ఇంతకీ టీడీపీ అధినేతకు ఇంత ఆగ్రహం రావడానికి కారణాలేమిటి? . విభజన చట్టంలోని హామీల విషయంలో కేంద్రం నిర్లిప్తంగా వ్యవహరిస్తూ ఉండటం.. నాలుగేళ్లు గడుస్తున్నా హామీల అమలుకు నిర్ధిష్టమైన చర్యలు తీసుకోకపోవడంతో చంద్రబాబు కూడా అసంతృప్తితో ఉన్నారు. కానీ ఆయన ఇప్పటి వరకు ఎక్కడా బయటపడలేదు. కేంద్రం నుంచి సాధించుకుంటామనే ఉద్దేశంతోనే బాబు ఇప్పటి వరకు రాష్ట్రానికి రావాల్సిన ఆర్థిక సాయం... ప్రాజెక్టుల గురించి పదేపదే లేఖలు రాశారు. కానీ కేంద్ర నుంచి స్పందన మాత్రం అంతంత మాత్రమే ఉంటుందన్న అసంతృప్తి ప్రభుత్వ వర్గాల్లో చాలా రోజుల నుంచి ఉంది. 

ఎన్డీఏ కూటమిలో భగస్వాములుగా ఉన్న కారణంగా వచ్చే ఎన్నికల్లో పొత్తు వ్యవహారాలపై మొన్నమొన్నటి వరకు సీఎం చంద్రబాబు నేరుగా స్పందించలేదు. పోలవరం విషయంలో కేంద్రం ఇటీవల వరుస అడ్డంకులు సృష్టించింది. ఉద్దేశపూర్వకంగా రాసిన లేఖలు... సృష్టించిన అడ్డంకుల వల్ల ప్రాజెక్టు నిర్మాణం మూడు నెలలపాటు నత్తనడకన సాగింది. ఒకసారి పనులు ఆగితే మళ్లీ పనుల ప్రారంభించడం కష్టంతో కూడుకున్న వ్యవహారమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదేపదే విజ్ఞప్తి చేసినా కేంద్రంలో కదలిక రాలేదు. దీంతో ప్రొటొకాల్ పక్కన పెట్టి మరీ నాగపూర్ వెళ్లి.. కేంద్రమంత్రి గడ్కరీతో దీనిపై సంప్రదింపులు కూడా చేశారు. కానీ ఆలస్యం మాత్రం జరిగిపోయింది. కొంతమంది టీడీపీ నాయకులు మాత్రం బీజేపీకి వ్యతిరేకంగా వ్యాఖ్యానాలు చేశారు. సహజంగానే బీజేపీ నాయకులు కూడా టీడీపీని ఉద్దేశించి పరుష వ్యాఖ్యానాలు చేశారు. అయితే టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం బీజేపీ నాయకుల వ్యాఖ్యలపై మొన్నీమధ్యనే ఫైర్ అయ్యారు. అవసరమైతే బీజేపీకి గుడ్‌బై చెప్పడానికి కూడా వెనకాడబోనంటూ హెచ్చరికలు చేశారు. అయినా తాను ఈ విషయాన్ని బీజేపీ అగ్రనాయకత్వంతోనే చూసుకుంటానని, ఈ విషయమై ఎవరూ మీడియా ఎదుట చర్చించకూడదని గతంలోనే చంద్రబాబు సొంత పార్టీ నేతలకు హెచ్చరికలు కూడా జారీ చేశారు.  మహా సహనపరుడైన సీఎం చంద్రబాబునాయుడిలో కూడా బీజేపీ పట్ల ఇప్పుడిప్పుడే అసహనం తొంగిచూస్తోంది. ఈ విషయాన్ని ఆ పార్టీ ముఖ్య నాయకులే పేర్కొంటున్నారు. తాము బీజేపీతో మిత్రధర్మం పాటిస్తున్నా.. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంతగా తగ్గి ఉందామనుకుంటున్నరు.దాన్ని బీజేపీ నాయకత్వం అలుసుగా తీసుకునితమ పార్టీ, ప్రభుత్వంపై అనవసరంగా విమర్శలు చేస్తున్నట్లు కూడా చంద్రబాబు భావిస్తున్నారని ఇటీవల చంద్రబాబు నాయుడు చేసిన తాజా వ్యాఖ్యల ద్వారా తెలుస్తోందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. 

Related Posts