మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ట్రేడింగ్ ప్రారంభమైన మొదటి గంట సేపు ఊగిసలాడిన దేశీయ మార్కెట్లు తర్వాత జోరందుకున్నాయి. కొన్ని షేర్ల కొనుగోళ్లకు మదుపర్లు మొగ్గుచూపడంతో మార్కెట్లు లాభాల దిశగా కదిలాయి. మార్కెట్లు ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 114 పాయింట్లు లాభపడి 35,379 వద్ద ముగియగా, మరో సూచీ నిఫ్టీ 43 పాయింట్లు పుంజుకుని 10,670 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ సెన్సెక్స్ సూచీ30లో 18 కంపెనీలు లాభపడగా 12 కంపెనీలు స్వల్పంగా నష్టపోయాయి. వీఈడీఎల్ అత్యధికంగా నష్టపోయింది.
సన్ ఫార్మా(1.79%), మారుతి(1.72%), ఇన్ఫీ(1.44%), ఓఎన్‌జీసీ(1.26%), రిలయన్స్(1.10%) అత్యధికంగా లాభపడగా, మరో వైపు వీఈడీఎల్(3.25%), ఐసీఐసీఐ బ్యాంక్ (1.62%), హెఛ్‌డీఎఫ్‌సీ(0.56%), ఎస్‌బీఐఎన్(0.52%), పవర్ గ్రిడ్ (0.40%) ఎక్కువగా నష్టపోయాయి. ఎన్‌ఎస్‌ఈలో సిప్లా, బజాజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, మారుతి, లుపిన్, సన్‌ఫార్మా షేర్లు లాభపడగా.. వేదాంత లిమిటెడ్, భారతీ ఇన్‌ఫ్రాటెల్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు నష్టపోయాయి.
ఎఫ్‌పీఐల అమ్మకాలునగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1205 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 367 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశాయి