YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అశోక్ బాబుకు టీడీపీలో సముచిత స్థానం

అశోక్ బాబుకు టీడీపీలో సముచిత స్థానం
టీడీపీలోకి ఏపీ ఎన్జీవోస్‌ అధ్యక్షుడు అశోక్‌ బాబు ఎప్పుడు వచ్చినా సముచిత స్థానం కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈరోజు ఏలూరులో ఎన్జీవో హోమ్‌ భవనాన్ని ప్రారంభించిన చంద్రబాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ... విభజన సమయంలో ఎన్జీవోలు తీవ్రస్థాయిలో పోరాటాలు చేశారని, అదే విధంగా ఇప్పుడు రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్నారని చెప్పారు. అశోక్‌బాబు మంచి నాయకత్వ లక్షణాలున్న నాయకుడని, ఆయన టీడీపీలో క్రియా శీలంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అన్నారు. తమ పార్టీలోకి ఆయనను ఆహ్వానిస్తున్నానని అన్నారుఏపీ సీఎం చంద్రబాబు ఏలూరులో సుడిగాలి పర్యటన చేశారు. ఎస్వీఆర్ కాంస్య విగ్రహాన్ని ప్రారంభించిన బాబు... ఏలూరులో ఏపీ ఎన్జీవో కొత్త భవనాన్ని ప్రారంభించారు. తర్వాత పశ్చిమగోదావరి జిల్లా సహకార సంఘ భవనాలను ప్రారంభించారు.పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కలపర్రు టోల్‌గేటు సమీపంలోని వై జంక్షన్‌ వద్ద ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఎస్వీఆర్‌లా సంభాషణలు పలికించే వ్యక్తి గతంలో లేరని, రాబోయే కాలంలో ఉండబోరని అన్నారు. ఆయన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. ఆ మహానటుడి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడం తన పూర్వ జన్మ సుకృతమని అభిప్రాయపడ్డారు.అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్న నటుడు ఎస్వీ రంగారావు అని కొనియాడారు. ఆయన నటించిన అనేక చిత్రాల్లో తనదైన నటనా శైలితో తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. ఎస్వీ రంగారావు విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రాంతంలోనే మ్యూజియం ఏర్పాటు చేసి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.ఎస్వీ రంగారావు వంటి గొప్ప నటుడి విగ్రహం ఆవిష్కరించడం పూర్వ జన్మ సుకృతమన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఎస్వీఆర్ శతజయంతి సందర్భంగా.. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని కలపర్రులో కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఎన్టీఆర్-ఎస్వీఆర్‌కు మధ్య ఉన్న స్నేహం గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. ఎన్టీఆర్, ఎస్వీ రంగారావులు గొప్పనటులని కీర్తించారు. ఎన్టీఆర్, ఎస్వీఆర్ ఇద్దరూ మంచి స్నేహితులని.. రెచుక్క, పగటిచుక్క, మాయాబజార్, శ్రీకృష్ణ విజయం, ఆత్మబంధు వంటి సినిమాలతో పాటు... పాతాళ భైరవి, పాండవ వనవాసంలో ఎన్టీఆర్, ఎస్వీఆర్ కలసి నటించిన అద్భుతమైన సినిమాలని గుర్తు చేశారు. 

Related Posts