అమరావతిలోని వెలగపూడిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను తాడిపత్రి ఎమ్మెల్యే జె.సి.ప్రభాకర్ రెడ్డి గారి తనయుడు, జె.సి.అష్మిత్ రెడ్డి కలిశారు.ఈసందర్భంగా ఆయన తాడిపత్రి నియోజకర్గంలో పరిష్కరించాల్సిన సమస్యలు,అవరమైన అభివృద్ధి పనులగురించి ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. కడపజిల్లా గండికోట రిజర్వాయర్ నుండి తాడిపత్రి ప్రాంతానికి సంబంధించి రూపొందించిన జె.సి.నాగిరెడ్డి త్రాగునీటి పథకంపై చర్చించారు. ఈపథకం ఎలాంటి ఆటంకాలు లేకుండా అమలయ్యేలా చొరవచూపి తాడిపత్రి మున్సిపాలిటీతో పాటు పరిసర ప్రాంతాలకు సమృద్ధిగా నీరందించాలని కోరారు.ఇందుకు స్పందించిన ముఖ్యమంత్రి ఈనీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీఇచ్చారు. తాడిపత్రి మండలం తలారిచెర్వు గ్రామంలో ప్రస్తుతం 500 మెగావాట్ల సామర్థ్యంతో జరుగుతున్న సోలార్ ప్లాంట్ నిర్మాణం పనులుపూర్తికావచ్చాయి.దీనికి అదనంగా మరో 500 మెగావాట్ల సామర్థ్యంతో మరొక సోలార్ ప్లాంట్ కు అనుమతి ఇవ్వాలని యువనేత ముఖ్యమంత్రి గారిని కోరారు.ఇందుకు సమ్మతించిన సి.ఎం.గారు సంబంధిత అధికారులతో చర్చించి తలారిచెర్వులో మరో సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు చొరవ చూపుతానని హామీఇచ్చారు.
తాడిపత్రి నియోజకవర్గంలో రోడ్ల ఆవశ్యకతను కూడా ముఖ్యమంత్రి దృష్టికి అస్మిత్ తెచ్చారు.ఈ విషయమై పంచాయతీరాజ్ శాఖామంత్రి నారాలోకేశ్ కు చెప్పి అవరమైన రోడ్లనిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని ఆయన హామీఇచ్చారు. తాడిప