- ఖగోళ అద్భుత దృశ్యం ఈ సంపూర్ణ చంద్రగ్రహణం.
- మీరూ రెడీగా ఉండండి.. !!
- చెలిమెల రాజేశ్వర్, జేవీవీ, తెలంగాణ.
"సూపర్ మూన్","బ్లడ్ మూన్","బ్లూ మూన్.."అన్నీ కలగలిపి ఒకేసారి రావడమనేది ఒక అరుదైన ఖగోళ ఘట్టం..చంద్రుడు, భూమి చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్ష్యలో తిరిగే క్రమంలో ఒక్కోసారి భూమికి దూరంగా, ఒక్కోసారి భూమికి దగ్గరగా రావడం జరుగుతుంది..అలా చంద్రుడు, భూమికి దగ్గరగా వచ్చినప్పుడు, ఏర్పడే పౌర్ణమి నాటి చంద్రున్ని "సూపర్ మూన్" అంటారు..'సూపర్ మూన్' సందర్భంగా చంద్రుడు, మామూలు కంటే 14 రెట్లు పెద్దగా, 30 రెట్లు ఎక్కువ ప్రకాశవంతంగా, కొత్త, కొత్త రంగుల్లో కనిపిస్తాడు..అలాగే ఒకే నెలలో రెండుసార్లు పౌర్ణమి వస్తే., అలా నెల చివర్లో వచ్చే రెండవ పౌర్ణమి నాటి చంద్రున్ని "బ్లూ మూన్" అంటారు. ఇది రెండున్నర సంవత్సరాలకోసారి వస్తుంది..ఇక 'సూపర్ మూన్' సందర్భంగా చంద్ర గ్రహణం ఏర్పడితే., అపుడు (ఎర్రగా) కనపడే పౌర్ణమి నాటి చంద్రున్ని "బ్లడ్ మూన్" అని పిలుస్తారు..
గ్రహణ సమయంలో చంద్రుడు, భూమి నీడలోకి వెళ్ళడం వళ్ళ, సూర్యుడి నుండి వచ్చే కాంతి భూమికి చేరి, తర్వాత చంద్రుని మీద ప్రతిఫలిస్తుంది. దాంతో చంద్రుడు ఎరుపు రంగులో (రక్త వర్ణంలో) కనిపిస్తాడు. అందుకే దాన్ని 'బ్లడ్ మూన్' అంటారు..ఇలాంటి ఖగోళ ఘట్టం, గతంలో 1866 సం.లో సంభవించింది. తిరిగి 151 సం.ల తర్వాత ఇపుడు, అంటే 31.01.2018 నాడు ఆ పరిస్థితి పునరావృతం ఔతుంది, కాబట్టి అందరం మిస్ కాకుండా చూడాలి..సంపూర్ణ చంద్రగ్రహణం ఇండియాలో ఈ (2018 - జనవరి) 31న, బుధవారం సా. 6.21 లకు ప్రారంభమై సా. 7.37 వరకు ముగిసి పోతుంది., ఈ అందమైన (సూపర్ మూన్, బ్లడ్ మూన్, బ్లూ మూన్) గ్రహణపు చంద్రున్ని మనమందరం చూసి ఆనందించాలి..చంద్ర గ్రహణం సందర్భంగా ఏ ప్రమాదకర కిరణాలూ వెలువడవు, కాబట్టి ఎలాంటి ఫిల్టర్లు (మన కంటికి అడ్డంబెట్టుకునే) అవసరం లేకుండానే.. మనం, మన మామూలు కంటితో కూడా (చంద్ర) గ్రహణాన్ని చూడొచ్చు..వీలైతే ఆ సమయంలో భోజనం చేస్తూనో (లేదా ఏదైనా అల్పాహారం తీసుకుంటూనో కూడా) మరీ గ్రహణపు చంద్రున్ని చూడండి ఏమీ కాదు..
అసలు గ్రహణం చూడటం వల్ల సాధారణ మనుషులతో పాటు, గర్భిణీ స్త్రీలకు గానీ, మరి ఏ ఇతర జీవరాశికి గానీ ఎలాంటి ప్రమాదమూ సంభవించదు..చంద్రుడు, భూమి చుట్టూ తిరిగే క్రమంలో, ప్రతీ పౌర్ణమినాడు తాను వెళ్ళే దారిలోనే ఈ పౌర్ణమినాడు కూడా ప్రయాణిస్తాడు, కాకపోతే గ్రహణం రోజు, భూమి నీడ గుండా (చంద్రుడు) వెళ్తాడు..సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకానొక సందర్భంలో, ఒకే సరళ రేఖపై చేరినప్పుడు, భూమి నీడ చంద్రుని మీద పడటం జరుగుతుంది. లేదా భూమి నీడ గుండా చంద్రుడు ప్రయాణిస్తాడు. ఈ సందర్భాన్నే మనం "చంద్రగ్రహణం" అంటాం.. అంతే..ఈ ఖగోళ అద్భుతాలను చూసి ఆనందించాలి, కాని మూఢ నమ్మకాల్లో మునిగిపోయి ఇంట్లో దాక్కోకూడదు. కాబట్టి ముందే ప్లాన్ చేసుకొని, మీరు చూడండి., అలాగే మీతో పాటు మీ కుటుంబ సభ్యులకు, మీ మిత్రులకూ, ఈ అరుదైన ఖగోళ ఘట్టాన్ని చూపించండి..
--- చెలిమెల రాజేశ్వర్, జేవీవీ, తెలంగాణ.