నెల్లూరు జిల్లా కావలిలో నియెజకవర్గ స్థాయి బిజెపి కార్యకర్తల సమావేశం లో రాష్ట్ర అద్యక్షుడు కన్నాలక్ష్మీనారాయణ, జిల్లా బిజెపి నాయకులు పాల్గోన్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పనిలో అవినీతిలో కూరుకుపోయింది . గ్రామ స్థాయిలో జరిగే అభివృద్ధి కి ప్రతి పైసా కేంద్ర ప్రభుత్వానిది పేరు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటుందని అన్నారు. నెల్లూరు జిల్లా లో పోర్టు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దంగా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం స్థలం చూపించటం లేదని లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు.