గురువారం నాడు రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల ఇండ్లలో సామూహిక గృహ ప్రవేశాలు చేయబోతున్నాం. పేదవారి ఇంటి పండుగైన గృహప్రవేశాలను ఘనంగా చేయబోతున్నామని మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. బుధవారం నాడు అయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం పేదల స్వంత ఇంటికలను నెరవేర్చబోతుంది. కేంద్రం నుంచి అందుతున్న అరకొర సహాయంతో.....కొన్ని ఇండ్లను పిఎంఏవై ఎన్టీఆర్ గృహ కల్ప కింద నిర్మిస్తున్నాం. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో మినహా 174 నియోజకవర్గల్లో ఈ కార్యక్రమం జరుగుతుందని అయన అన్నారు. పేదవారికి పక్క ఇండ్లు ఉండాలని ఎన్టీఆర్ సంకల్పం. 2019 కల్లా 19లక్షల ఇండ్లను నిర్మించి ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. గ్రామీణ గృహ నిర్మాణశాఖ ద్వారా 19370 వేల కోట్ల రూపాయలను గృహ నిర్మాణం కోసం ఖర్చు చేయబోతున్నామని అన్నారు. రాష్ట్రం నలుమూలల పేద,దిగువ మధ్యతరగతి వారికి పక్క ఇండ్లను నిర్మించి ఇస్తున్నాం. సంవత్సరానికి 5లక్షల ఇండ్లు ఇవ్వాలని కేంద్రాన్ని అడుగుతుంటే,పాత లెక్కలను చూపిస్తూ ఇవ్వడంలేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఇండ్ల మంజూరు విషయంలో కేంద్రం తీరని అన్యాయం చేస్తుంది. రాష్ట్రంలో ఆర్థిక సమస్యలు వెంటాడుతున్న....సీఎం పేదవారి స్వంతఇంటికలకు అడ్డురాకుండా నిధులు సమకూరుస్తున్నారు. ఇండ్ల నిర్మాణం పూర్తి స్థాయి పారదర్శకంగా చేపట్టామని మంత్రి అన్నారు.