YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మరో రెండొందలు వరికి మద్దతు ధర పెంచిన కేంద్రం

 మరో రెండొందలు వరికి మద్దతు ధర పెంచిన కేంద్రం
కేంద్రం రైతన్నకు శుభవార్త వినిపించింది. కనీస మద్ధతు ధరలను భారీగా పెంచుతున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు 2018-19 సంవత్సరానికిగాను వరికి క్వింటాలుకు రూ.200 మేర మద్దతు ధర పెంచనున్నారు. తాజా పెంపుతో వరి మద్దతు ధర రూ.1750కి చేరింది. వరితోపాటు మరో 13 ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరలను పెంచడానికి కూడా ప్రభుత్వం అంగీకరించింది. వచ్చే కేబినెట్ సమావేశంలోనే ఈ నిర్ణయానికి ఆమోదముద్ర పడనుంది. ఇప్పటికే 2017-18లో వరి పంట ఉత్పత్తి 11.1 కోట్ల టన్నులతో కొత్త రికార్డును అందుకుంది. ఈ నిర్ణయం ద్వారా దేశంలో వరి ఉత్పత్తి మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. సాధారణంగా పంట వేసే ముందు కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరను ప్రకటిస్తుంది. ఆ ప్రకటన మేరకు రైతులు ఏ పంట వేయాలన్న నిర్ణయం తీసుకుంటారు. ఈ ఏడాది బడ్జెట్‌లోనూ కేంద్రం ఇదే విషయాన్ని స్పష్టంచేసింది. సాధారణంగా పంట వేసే ముందే కేంద్రం కనీస మద్దతు ధరను ప్రకటిస్తుంది. దీనిని బట్టి రైతులు ఏం పంట వేయాలన్నది నిర్ణయం తీసుకుంటారు. వరిపై కనీస మద్దతు ధరను భారీగా పెంచడం వల్ల దేశంలో ఉత్పత్తి మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే 2017-18లో వరి పంట ఉత్పత్తి 11.1 కోట్ల టన్నులతో కొత్త రికార్డును అందుకుంది.

Related Posts