YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీగా మారింది

కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీగా మారింది
మోదీ నోట..మహకూటమి మాట.. మీరు విన్నది నిజమే ... తన ఓటమే లక్ష్యంగా మహా కూటమి .. వెలుగులోకి తెచ్చారని మోదీ అన్నారు... మోదీని తొలగించాలనే ఏకైక లక్ష్యంతో మహా కూటమి దిశగా అడుగులు పడుతున్నాయని అన్నారు. ప్రతిపక్షాలను కలిపి ఉంచుతున్నది మోదీపై ద్వేషం ఒక్కటే అన్న మోదీ వ్యాక్యలు ఇప్పుడు రాజకీయ విశ్లేషకులలో ఆశక్తి రేకితిస్తున్నాయి.కమలనాథులలో మహాకూటమి కలవరం మొదలైందన్న సంకేతాలు వినిపిస్తున్నాయి.  కమలం పార్టీ నేతలు మాత్రమే ఇప్పటి వరకూ కూటమి గురించి ప్రస్తావిస్తూ వస్తే .. ఇప్పుడు ఏకంగా ప్రధానమంత్రి మోదీ నోటినుంచి.. ప్రతిపక్షాలు ఏర్పాటకు సన్నద్దమవుతున్న మహకూటమి గురించి.... మాట్లాడారు..మహకూటమితో కాంగ్రెస్ తన మనుగడను కాపాడుకునేందుకు యత్నిస్తుందని.. ప్రతిపక్షాల్లోని అందరి దృష్టీ అధికారంమీదేనని. వ్యక్తిగత మనుగడప్రధాని పదవి తప్ప వాళ్లకు మరొకటి అక్కర్లేదని  మోదీని..  ప్రతిపక్షాలపై విమర్శనాస్తాలు సందిస్తున్నారు.ఇప్పుడు కాంగ్రెస్ ఓ ప్రాంతీయ పార్టీలా మారిందనిప్రతిపక్ష సంకీర్ణాన్ని కుదిర్చే శక్తి దానికి లేదని మోదీ విమర్శించారు.. ఎన్డీయేలో లుకలుకలు ఉన్నాయనడాన్ని మోడీ తోసి పుచ్చారు.. ఎన్డీయేను నమ్మకానికి నిదర్శనంగా చెప్పుకొచ్చారు..రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని మోదీ ధీమా వ్యక్తం చేశారు.ప్రతిపక్షాల గగ్గోలుకుఅభివృద్ధిసుపరిపాలనకు మధ్య రాబోయే ఎన్నికలు జరగనున్నాయని ప్రధాని మోదీ  చెప్పారు.. ఇందుకు కర్ణాటకను ఉదాహరణగా చూపారు. ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్‌,జేడీఎస్‌ సంకీర్ణం ప్రజా తీర్పును దొంగిలించింది అన్నారు.భవిష్యత్తులో ఏం జరగబోతోందో చెప్పడానికి ఆ రాష్ట్రం ఓ సూచికఅని చెప్పారు. మోదీ మాత్రం గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తున్నా .. అంతర్గతంగా... మహకూటమి భయం వెంటాడుతున్న వాదనలు వినిపిస్తున్నాయి...మహాకూటమి ఏర్పడి ప్రతిపక్షపార్టీలు అన్నీ ఒకే తాటిపైకి వస్తే మాత్రం కమల నాధులకు కష్టాలు తప్పవన్న వాదనలు వినిపిస్తున్నాయి.. 2019 సార్వత్రిక  ఎన్నికలు వేడిరాజేస్తున్న వేళ విజయపథంలో ఏపార్టీ దూసుకు పోతుందో వేచిచూడాల్సిందే..

Related Posts