YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

రివ్యూ : 'పంతం'

 రివ్యూ : 'పంతం'

 నిర్మాణ సంస్థ‌: శ‌్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్‌
తారాగ‌ణం: గోపీచంద్‌, మెహ్రీన్ కౌర్‌, శ్రీనివాస‌రెడ్డి, పృథ్వి, సంప‌త్ త‌దిత‌రులు
సంగీతం: గోపీ సుంద‌ర్‌
ఛాయాగ్ర‌హ‌ణం: ప‌్ర‌సాద్ మూరెళ్ళ‌
మాట‌లు: ర‌మేశ్ రెడ్డి, శ్రీకాంత్‌
కూర్పు: ప‌్ర‌వీణ్ పూడి
క‌ళ‌ : ఎ.ఎస్‌.ప్ర‌కాశ్‌
నిర్మాత‌: కె.కె.రాధామోహ‌న్‌
ద‌ర్శ‌క‌త్వం: కె.చ‌క్ర‌వ‌ర్తి
క‌థ‌
ఒక రాష్ట్రానికి హోమ్ మినిస్ట‌ర్ జ‌యేంద్ర (సంప‌త్‌), హెల్త్ మినిస్ట‌ర్ (జ‌య‌ప్ర‌కాష్‌రెడ్డి). వారిద్ద‌రి డ‌బ్బును ప్లాన్ వేసి కొట్టేస్తుంటాడు ఓ వ్య‌క్తి (గోపీచంద్‌). ఓసారి మినిస్ట‌ర్ కాన్వాయ్ నుంచి, మ‌రోసారి రైలు భోగీ నుంచి, మ‌రోసారి మినిస్ట‌ర్ హ‌వాలా చేసే డ‌బ్బు, ఇంకోసారి మినిస్ట‌ర్ గ‌ర్ల్ ఫ్రెండ్ ద‌గ్గ‌ర దాచిన డ‌బ్బు ... ఇలా చాలా విధాలుగా కోట్ల రూపాయాల‌ను కొట్టేస్తుంటాడు. త‌మ డ‌బ్బును కొట్టేసిన వ్య‌క్తి ఎవ‌రో ఒకానొక స‌మ‌యంలో జ‌యేంద్ర‌కు తెలుస్తుంది. అయితే ఆ వ్య‌క్తి మామూలు వాడు కాద‌నీ, ప్ర‌పంచంలో టాప్ టెన్ రిచెస్ట్ పీపుల్ లో ఒక‌రైన సురానా ఇండ‌స్ట్రీ అధినేత కుమారుడ‌ని అర్థ‌మ‌వుతుంది. అంత డ‌బ్బున్న వ్య‌క్తి కుమారుడికి ఇలా హోమ్ మినిస్ట‌ర్ డ‌బ్బును దొంగ‌లించాల్సిన అవ‌స‌రం ఏంటి? అత‌నికి అనాథాశ్ర‌మానికి లింకేంటి? అత‌ను కొట్టేసిన డ‌బ్బును ఏం చేశాడు? డొనేష‌న్లు కూడా అవ‌స‌రం లేనంత‌గా త‌రాలు తినేలా నిధులున్న అనాథాశ్ర‌మానికి అత‌ని వ‌ల్ల క‌లిగిన ఉప‌యోగం ఏంటి? ఆ అనాథ ఆశ్ర‌మం అత‌నికి ఎలా ఉప‌యోగ‌ప‌డింది వంటివ‌న్నీ స‌స్పెన్స్. చెప్పుకోవ‌డానికి కొత్త క‌థ కాదు అని ఈ సినిమాలోనే ఒక డైలాగ్ ఉంది. మ‌రి కొత్త క‌థ కాని క‌థ‌ను తెర‌మీద ద‌ర్శ‌కుడు ఎలా కొత్త‌గా చెప్పాడ‌నేది సినిమాలో చూడాల్సిందే.
 
ప్ల‌స్ పాయింట్స్
- గోపీచంద్ లుక్స్
- యాక్ష‌న్ పార్ట్
- డైలాగులు
- కెమెరా
- క్లైమాక్స్
 
మైన‌స్‌పాయింట్స్
- రొటీన్ క‌మ‌ర్షియ‌ల్ క‌థ‌
- రొటీన్ స్క్రీన్‌ప్లే
- సంగీతం
- కామెడీ లేక‌పోవ‌డం
    రేటింగ్: 2.5/5

Related Posts