YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

కొరడా ఝలిపించిన ఫేసుబుక్..

కొరడా ఝలిపించిన ఫేసుబుక్..

ఈ ఏడాది నుంచి జనాన్ని తప్పుదోవ పట్టించే తప్పుడు వార్తలపై కొరడా ఝలిపిస్తామని ప్రకటించిన ఫేస్‌బుక్ చెప్పినట్టే చేసింది. ప్రపంచవ్యాప్తంగా విమర్శలు ఎదుర్కొంటున్న బిట్‌కాయిన్‌పై తన అభిప్రాయాన్ని స్పష్టం చేస్తూ.. దానికి సంబంధించిన ప్రకటనలను తన ఫ్లాట్‌ఫాంలపై నిషేదించింది. ఇన్‌స్టాగ్రామ్‌, ఆడియన్స్‌ నెట్‌వర్క్‌, మెసెంజర్‌లలోనూ వీటిని ప్రోత్సహించరాదని నిర్ణయించింది. తప్పుదారిపట్టించే ఫైనాన్షియల్‌ ప్రోడక్టులను ప్రోత్సహించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. క్రిప్టోకరెన్సీలు, ఐసీఓలపై పలు కంపెనీలు జారీ చేస్తున్న ప్రకటనలు విశ్వసనీయంగా లేవని ఫేస్‌బుక్‌ ప్రోడక్ట్‌ మేనేజ్‌మెంట్‌ డైరెక్టర్‌ రాబ్‌ లెథెరెన్‌ చెప్పారు. ఈ తరహా ప్రకటనలు ఫేస్‌బుక్‌ ఫ్లాట్‌ఫాంలపై నుంచి నిషేధిస్తున్నామన్నారు.కొత్త ప్రోడక్టుల గురించి ఫేస్‌బుక్‌ యాడ్స్‌ ద్వారా తెలుసుకునే వెసులుబాటు ఉంటుందని తెలిపారు. అయితే ఫేస్‌బుక్‌ యాడ్స్‌పై ప్రజలు ఎలాంటి అభ్యంతరాలున్నా తమకు నివేదించవచ్చని కోరారు. ప్రజలను తప్పుదారి పట్టించే ప్రకటనలకు ఫేస్‌బుక్‌లో తావులేదని కంపెనీ స్పష్టం చేసింది. 

Related Posts