తిరుమల శ్రీవారిని తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు వివేక్, మాజీ ఎంపీ వినోద్ గురువారం ఉదయం దర్శించుకున్నారు. ఈ రోజు నైవేద్య విరామ సమయంలో వివేక్, వినోద్ సోదరులు కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వారికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనంతరం రంగనాయకుల మండపంలో వివేక్, వినోద్ దంపతులకు ఆలయ అర్చకులు వేదశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందచేసి పట్టువస్త్రంతో సత్కరించారు. తన కూతురు వైష్ణవి వివాహం తరువాత స్వామి వారి ఆశీర్వాదం కోసం తిరుమలకు వచ్చానని వివేక్ తెలిపారు. తెలంగాణలో కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధు కార్యక్రమానికి ప్రజలనుంచి మంచి స్పందన వస్తుందని వివేక్ అన్నారు. ఇరు రాష్ట్రాలు బాగా అభివృద్ధి చెందాలని కోరుకున్నాననారు. ఇరు రాష్ట్రాలకు ఇచ్చిన హాలు నెరవేర్చాలని తెలంగాణ ప్రభుత్వం కూడా కేంద్రంపై ఒత్తిడి తెస్తుందని వివేక్ తెలిపారు.
మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కేంద్రం విభజన హామీలు అమలుపరిచినట్లు సుప్రీమ్ కోర్ట్ లో అబద్ధపు అఫిడిఫిట్ ను ఇచ్చారని అన్నారు. వెంకన్న పాదాల సాక్షిగా రాష్ట్రానికి ఇచ్చిన హామీలు గలిమాటలు గా నిలిచిపోయాయని పొన్నం విమర్శించారు. ఇరు రాష్ట్రాలకు ఇవ్వవలసిన విభజన హామిలు కేంద్రం పై ఉన్న వాటిని పట్టించుకోకుండా పెడచెవిన పెడుతున్నట్లు పొన్నం మండిపడ్డారు.