YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

బ్లాక్ బెర్రీ మోడల్ లో జియో ఫోన్ 2

బ్లాక్ బెర్రీ మోడల్ లో జియో ఫోన్ 2
టెలికాం వినియోగ‌దారులంతా ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న జియో గిగా ఫైబ‌ర్, జియో ఫైబ‌ర్ బ్రాడ్‌బ్యాండ్ సేవ‌ల తేదీని రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ వెల్ల‌డించింది. ముకేశ్ అంబానీ కూతురు ఇషా అంబానీ, కొడుకు ఆకాశ్ అంబానీలు వీటి గురించిన ప్ర‌క‌ట‌న చేశారు. ముంబ‌యిలో జ‌రుగుతున్న ఆర్‌ఐఎల్ 41వ వార్షిక స‌ర్వ‌స‌భ్య స‌మావేశంలో ఈ సేవ‌ల‌కు సంబంధించిన ప్ర‌క‌ట‌న వెలువడింది. ఆగ‌స్టు 15 నుంచి దేశ‌వ్యాప్తంగా జియోగిగా ఫైబ‌ర్ సేవ‌లు అందుబాటులోకి రానున్నాయి. జియో గిగా ఫైబ‌ర్ కోసం మై జియో, జియో.కామ్ వెబ్‌సైట్లో రిజిస్ట్రేష‌న్లు చేసుకోవ‌చ్చు.జియో ఎఫ్‌టీటీహెచ్ ద్వారా అత్య‌ధిక డేటా వేగం, ఈ సేవ‌ల ప్ర‌త్యేక‌త‌లేంటి.దాదాపు 1100 న‌గ‌రాల్లో అత్యాధునిక‌, ఫైబ‌ర్ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ సేవ‌ల‌ను అందించ‌నున్న‌ట్లు ముకేశ్ అంబానీ వెల్ల‌డించారు. గ‌త కొన్ని నెల‌లుగా ఎంపిక చేసిన న‌గరాల్లో జియో ఫైబ‌ర్ బీటా సేవ‌ల టెస్టింగ్ జ‌రిగింది. ఇక‌పై జియో ఫైబ‌ర్ సేవ‌లు ఇళ్ల‌కు, వ్యాపార‌స్థుల‌కు, చిన్న‌,మ‌ధ్య త‌ర‌హా సంస్థ‌ల‌కు అందుబాటులోకి రానున్నాయి. 
జియో గిగా ఫైబ‌ర్లో అందుబాటులో ఉండే రెండు ముఖ్య ఫీచ‌ర్లు స్మార్ట్ హోం టెక్నాల‌జీ, టీవీ కాలింగ్. సెట్‌టాప్ బాక్స్ ద్వారా టీవీలో సైతం జియోగిగా ఫైబ‌ర్ సేవ‌లు వాడుకోవ‌చ్చు. జియో ఫోన్లో సైతం ఈ అడ్వాన్స్ ఫీచ‌ర్లు ఉంటాయి. ఆకాశ్ అంబానీ, ఇషా అంబానీ, ఆర్‌ఐఎల్ ప్ర‌తినిధి కిర‌ణ్ ఈ స‌రికొత్త ఫీచ‌ర్ల‌ను ఎలా వినియోగించుకోవ‌చ్చు అనే దానిని ప్ర‌త్య‌క్ష ప్ర‌ద‌ర్శ‌న ద్వారా చూపించారు. మరో వైపు
లయన్స్ జియో.. భారత టెలీకాం రంగంలో పెను సంచలనం. మొత్తం టెలీకాం రూపు రేఖల్నే మార్చేసింది. మొబైల్ డాటా వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని వివోఎల్టీఈ టెక్నాలజీని తీసుకొచ్చింది ఈ ముఖేశ్ అంబానీ కంపెనీ. తక్కువ ధరలకే ఎక్కువ సేవలు, వేగవంతమైన మొబైల్ ఇంటర్నెట్‌ను అందిస్తూ స్వల్ప కాలంలో కోట్లలో కష్టమర్లను సొంతం చేసుకుంది. కేవలం టెలీకాం సర్వీసులకే పరిమితం కాకుండా చవకైన ఫీచర్ ఫోన్‌ను కూడా తీసుకొచ్చి సరికొత్త విప్లవానికి తెరలేపింది. ‘జియో ఫోన్’ పేరిట వచ్చిన ఈ ఫీచర్ ఫోన్ కోసం జనం ఎగబడ్డారు. 49 రూపాయలకే 28 రోజుల పాటు అపరిమిత కాల్స్‌ను అందిస్తుంటే ఎవరు వదులుకుంటారు! జియో ఫోన్‌కు వచ్చిన స్పందన చూసి ఇప్పుడు దానికి కొనసాగింపుగా ‘జియో ఫోన్ 2’ను అంబానీ కంపెనీ తీసుకొచ్చింది. గురువారం జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) 41వ వార్షిక సమావేశంలో జియో ఫోన్ 2ను ప్రకటించారు. రూ.2,999 విలువ కలిగిన ఈ ఫోన్ ఆగస్టు 15 నుంచి అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ఈ జియో ఫోన్ 2 చూడటానికి అచ్చుగుద్దినట్లు పాత బ్లాక్ బెర్రీ ఫోన్‌ను పోలి ఉంది. ఫీచర్లయితే మాత్రం జియో ఫోన్‌లో ఉన్నవే. క్వర్టీ కీ ప్యాడ్, వెడల్పైన స్క్రీన్ మాత్రమే జియో ఫోన్ 2లో కొత్త ఫీచర్లు. కియా ఓస్‌పై ఈ ఫోన్ పనిచేస్తుంది. 

Related Posts