మూడు టీ20ల సిరీస్‌ను భారత్ విజయంతో ఆరంభించింది. తొలి మ్యాచ్‌లో నెగ్గిన జోష్‌లో ఉన్న భారత్ ఇప్పుడు సిరీస్‌పై కన్నేసింది. దీనిలోనూ నెగ్గితే భారత్ వరుసగా ఆరో టీ20 సిరీస్‌ను ఖాతాలో వేసుకున్నట్టవుతుంది. భారత్‌కు ప్రధాన ఆయుధంగా మారిన చైనామన్ స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ రెండో టీ20లోనూ విజృంభించాలని జట్టు కోరుకుంటోంది. మరో వైపు ఇంగ్లాండ్ బ్యాటింగ్ కూడా జాసన్ రాయ్, మోర్గాన్, బెయిర్‌స్టో, రూట్, హేల్స్ లాంటి ఆటగాళ్లతో బలంగా ఉంది. వీరు స్పిన్నర్లను ఎలా ఎదుర్కొంటారనే దానిమీదే స్కోరు ఆధారపడి ఉంటుంది.