YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఇసుక ఇక ఈజీ

ఇసుక ఇక ఈజీ
జిల్లాలో గుర్తించిన వాటిలో 15 ఇసుక రేవుల బాధ్యతను ప్రభుత్వం తరఫున గ్రామ కమిటీలకు అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఆరు రేవులను మూడు నెలల పాటు గ్రామ కమిటీల ఆధ్వర్యంలో పైలట్‌ ప్రాజెక్టుగా నిర్వహించారు. దీనిపై ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇటీవల మంత్రి వర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు  ఈ మేరకు ఆదేశించారు. జిల్లాలో   మొత్తం 15 రేవులను ఈ తరహాలో నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన విధి విధానాలు రూపొందించి మండల కేంద్రాలకు పంపారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి అమలు చేయనున్నామని సంయుక్త కలెక్టర్‌ విజయకృష్ణన్‌ వెల్లడించారు. దీంతో ఇసుక ధరలకు కళ్లెం పడనుందని అభిప్రాయపడుతున్నారు. ఎక్కువ ధరలకు ఎవరైనా సరఫరా చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
కృష్ణా జిల్లాలో మొత్తం 15 రేవుల వరకు గుర్తించి తవ్వకాలకు అనుమతి ఇచ్చారు. వీటిలో గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఇసుక తవ్వకాలు జరుగుతాయి. షిప్టుల వారీగా సిబ్బంది పర్యవేక్షణ ఉంటుంది. రవాణా, లోడింగ్‌, బాట నిర్వహణకు నిర్ణీత రుసుములు వసూలు చేస్తారు. సొంతంగా వాహనాలు తెచ్చుకున్నా.. ఇసుక లోడింగ్‌ చేసుకోవచ్చు.‌ కృష్ణా జిల్లాలో చల్లపల్లి, పమిడిముక్కల, తోట్లవల్లూరు ఇసుక రేవులు ప్రకాశం బ్యారేజీ దిగువున ఉన్నాయి. ఎగువున కంచికచర్ల, నందిగామ, పెనుగంచిప్రోలు ఇసుక రేవులు ఉన్నాయి. ఈ ఆరు రేవులను ప్రభుత్వం గత రెండు నెలలుగా నిర్వహిస్తోంది.  ప్రభుత్వమే ఇసుక తవ్వకాలు జరిపి ఉచితంగా అందిస్తుంది. ‌్ర వీటికి అదనంగా సూరాయపాలెం, ఇబ్రహీంపట్నం, గుంటుపల్లి, రొయ్యూరు, వల్లూరిపాలెం, లంకపల్లి తదితర రేవులు ఉన్నాయి. చౌడవరం వద్ద ఇసుక తవ్వకాలు నిలిపివేశారు.
ఒక యూనిట్ ఇసుక తవ్వడానికి, వాహనంలో లోడింగ్‌ చేసేందుకు రూ.300 వసూలు చేయాలని ధర నిర్ణయించింది. ఒక యూనిట్‌ అంటే.. మూడు క్యూబిక్‌ మీటర్ల ఇసుక (ఒక ట్రాక్టర్‌ ట్రక్కు) అందిస్తారు. ట్రాక్టర్‌లతో పాటు రెండు యూనిట్ల లారీలను రేవులోకి అనుమతిస్తారు. లారీకి రూ.600 వసూలు చేస్తారు. బాట నిర్వహణ కోసం మొదట రూ.100 చొప్పున వసూలు చేశారు. తర్వాత రూ.30 చొప్పున వసూలు చేస్తున్నారు. ర్యాంపు వద్ద రోడ్డును ప్రభుత్వం నిర్వహిస్తుంది. తరచూ పాడయ్యే అయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పటికప్పుడు మరమ్మతులు ఆ మొత్తం వెచ్చిస్తారు. దీనికి క్యూఆర్‌ కోడ్‌ స్లిప్పులను అందజేస్తారు. ఈ స్లిప్పుల్లో తేదీ, సమయం, వాహన నెంబరు, పరిమాణం, తదితర వివరాలు ఉంటాయి. 
ఇసుక రేవుల నిర్వహణకు ముగ్గురు ఉద్యోగులను నియమిస్తారు. వీఆర్‌ఓ, పంచాయతీ కార్యదర్శి, ఉపాధి హామీకు సంబంధించి క్షేత్రసహాయకుడు కమిటీలో ఉంటారు. ఈ ముగ్గురు షిప్టుల పద్ధతిలో పర్యవేక్షిస్తారు. గనుల శాఖ నుంచి ఒక టాబ్‌ ఆపరేటర్‌ను నియమిస్తారు. ఆయన అక్కడికి వచ్చిన ట్రాక్టర్‌ లేదా లారీని ఫొటో తీసి అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఇది రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌లో కనిపిస్తుంది. ‌్ర ఒకరిని బాటకూలీగా నియమిస్తారు. కూలీలు ఆ గ్రామానికి చెందిన వారు పాల్గొనవచ్చు. ఎప్పటికప్పుడు వాటరింగ్‌ చేస్తారు. కూలీలకు తాగునీరు, నీడ సౌకర్యం కల్పిస్తారు. చెల్లింపులు అన్నీ పారదర్శకంగా వోచర్‌ ద్వారా జరుగుతాయి. వారం వారం కూలీలకు, బాట కూలీకి ఇతర ఖర్చులకు చెల్లింపులు చేస్తారు. ‌ ఇలా వసూలు చేసిన సొమ్మును గనుల శాఖ సహాయ సంచాలకులు, ఆయా రేవులు ఉన్న రెవెన్యూ డివిజన్‌ ఆర్డీఓ సంయుక్త ఖాతాలో జమ చేస్తారు. ఈ ఖాతా నుంచి కూలీలకు నేరుగా బదిలీ అవుతుంటాయి. 
కృష్ణా జిల్లాలో ఆరు రేవుల్లో ప్రయోగాత్మకంగా పరిశీలించిన తర్వాత ఇతర జిల్లాల్లో అమలు చేసేందుకు నిర్ణయించారు. దీనిలో కృష్ణా జిల్లా ఆదర్శంగా నిలిచింది. ఈ విధానంలో అందరికి ఉచితంగా ఇసుక అందించాలని, నిరుపేదల పక్కాగృహాల నిర్మాణం త్వరితగతిన జరిగేలా చూడాలని నిర్ణయించారు. ధర నియంత్రణలోకి తేవాలనేది ప్రధాన లక్ష్యం.  రెవెన్యూ డివిజనల్‌ అధికారులు పూర్తి నిఘా ఏర్పాటు చేయాల్సి ఉంది. ‌ 

Related Posts