నిర్మాణ సంస్థ: క‌్రియేటివ్ కమర్షియల్స్ మూవీ మేకర్స్
తారాగణం: సాయిధరమ్ తేజ్, అనుపమ పరమేశ్వరన్, జయప్రకాశ్, పవిత్రా లోకేశ్, పృథ్వీ, సురేఖా వాణి, వైవా హర్ష, జోష్ రవి, అరుణ్ కుమార్ తదితరులు
సంగీతం: గోపీ సుందర్
ఛాయాగ్రహణం: అండ్రూ.ఐ
మాటలు: డార్లింగ్ స్వామి
కూర్పు: ఎస్.ఆర్.శేఖర్
కళ: సాహి సురేశ్
సహ నిర్మాత: వల్లభ
నిర్మాత: కె.ఎస్.రామారావు
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ.కరుణాకరన్
`పిల్లా నువ్వు లేని జీవితం` సినిమాతో హీరోగా పరిచయమైన మెగా క్యాంప్ హీరో సాయిధరమ్ తేజ్. `తిక్క` సినిమా నుండి `ఇంటెలిజెంట్` సినిమా వరకు ఐదు వరుస పరాజయాలను చవిచూశాడు. ఎలాగైనా హిట్ కొట్టాలనుకుంటున్న తరుణంలో ప్రేమకథా చిత్రాల స్పెషలిస్ట్ కరుణాకరన్‌తో జత కట్టాడు. నాలుగేళ్ల తర్వాత కరుణాకరన్ మరో ప్రేమకథను సిద్ధం చేసుకున్నాడు. `తేజ్ ఐ లవ్ యు` పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎలా మెప్పించింది?. అసలు ఈ ప్రేమకథలో కరుణాకరన్ చెప్పాలనుకున్న విషయమేంటి? అనే సంగతి తెలియాలంటే సినిమా కథ తెలుసుకుందాం.
కథ
తేజ్ (సాయిధరమ్‌తేజ్) పద్ధతిగల కుటుంబానికి చెందిన అబ్బాయి. ఓ సమస్య కారణంగా అతన్ని, అతని పెదనాన్న(జయప్రకాష్) కుటుంబం నుంచి వెలివేస్తాడు. దాంతో కాలేజీ అయిపోయాక సప్లీలు రాసుకుంటూ హైదరాబాద్‌లోని బాబాయ్ (పృథ్వి) ఇంట్లో ఉంటాడు. అలా కాలేజీలో కొంత మంది స్నేహితులతో కలిసి ఓ రాక్ బ్యాండ్‌ని ఏర్పాటు చేసుకుని ప్రాక్టీస్ చేస్తుంటాడు. అలాంటి సమయంలోనే అతనికి నందిని (అనుపమ పరమేశ్వరన్) పరిచయమవుతుంది. అనుకోకుండా జరిగిన అగ్రిమెంట్ కారణంగా 15 రోజులు ఆమెకు అతను బాయ్ ఫ్రెండ్‌గా నటించడానికి సిద్ధమవుతాడు. ఆ గడువు పూర్తయ్యేలోపు ఆమే అతనికి గర్ల్ ఫ్రెండ్‌గా నటించడానికి సిద్ధపడుతుంది. ఇలా ఒకరికి ఒకరు చేరువయ్యే క్రమంలో నందినికి యాక్సిడెంట్ అవుతుంది. ఆ యాక్సిడెంట్ కి కారణం ఎవరు? నందినిని ఫాలో చేస్తున్న వారు ఎవరు? ఆమెకు ఎవరి వల్ల ప్రమాదం. లండన్ నుంచి నందిని అసలు ఇండియాకు ఎందుకు వచ్చింది? ఆమె తండ్రి ఆమెకు మంచి చేశాడా? చెడు చేశాడా? ఇంతకీ తేజ్, నందిని ఒకరినొకరు ఇష్టపడ్డారా? ఆ విషయం పరస్పరం చెప్పుకున్నారా? లేదా? వంటివన్నీ ఆసక్తికరం.
ప్లస్ పాయింట్లు
- సాయిధరమ్‌తేజ్, అనుపమ పరమేశ్వరన్, ఇతర నటీనటులు
- లొకేషన్స్, కాస్ట్యూమ్స్
- కెమెరా, అందమైన చందమామ పాట
మైనస్ పాయింట్లు
- రొటీన్ కథ
- సంగీతం
- స్క్రీన్‌ప్లే
రేటింగ్: 2.25/5