YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

హోదా అంశం చట్టంలో లేదు

హోదా అంశం చట్టంలో లేదు
ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో ఈ నాలుగు సంవత్సరాలుగా కేంద్రం చేసిన కార్యక్రమాలపై ప్రజలను వివరించడానికి పల్లెలకు తిరుగుతున్నాం. జిల్లాల పర్యటనలో భాగంగా తిరుపతి కి రావడం జరిగింది. తిరుపతి లో పలు హాస్టల్ ను, కళాశాలలను, మార్కెట్ యాడ్ లను సందర్శించానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ అన్నారు. శుకర్రవారం అయన మీడియా తో మాట్లాడారు. ప్రతి జిల్లాలో అందరినీ కలుపుకొని , రాష్ట్రంలో బీజేపీ మరింత బలోపేతనికి ముందుకెళ్తున్నాం. భారత దేశ చరిత్రలో రైతులకు లాభసాటి సబ్సిడీ అందించింది ఎన్డీయే ప్రభుత్వం. చిత్తురు జిల్లాలో మామిడి, టమోటా పంటలను పండించే రైతులు నష్టాల్లో మునిగిపోయారు. రైతులను గాలికొదిలేసి హ్యాపీ సండే అనే కార్యక్రమాలు చేస్తున్నారని అయన విమర్శించారు. చిత్తూరు డైరీని గాలికొదిలేసి..‘హెరిటేజ్’ ను అభివృద్ధి చేసుకుంటున్నారంటూ చంద్రబాబుపై మండిపడ్డారు.   చిత్తూరు చక్కెర ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని, రైతులను పట్టించుకోకుండా హ్యాపీ సండే కార్యక్రమాలు నిర్వహించడం సబబు కాదని అన్నారు. చంద్రబాబు తన నయనవంచన దీక్షలు ఆపి, రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఏపీ అవినీతిలో కూరుకుపోయిందని, టీడీపీ నేతలు బరితెగించి అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. తిరుమల అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కడప ఉక్కు ఫ్యాక్టరీపై సరైన స్పష్టత లేనందున ముందుకు రాలేకపోతున్నామని, విశాఖ రైల్వేజోన్ అంశం పరిశీలిస్తున్నామని, దీనికి ఇంకా సమయం ఉందని చెప్పారు. రాష్ట్రంలో వైద్య రంగంలో అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. విద్య రంగాన్ని వ్యాపార కేంద్రముగా మార్చేశారు. రాష్ట్రంలో బీజేపీ పర్యటనలు ప్రజల స్పందన వస్తోందని అయన అన్నారు. ముఖ్యమంత్రి రాష్ట్రంలో బీజేపీ పై అసత్య ప్రచారాలు చేస్తున్నారు. విభజన చట్టంలో పేర్కొన్న అంశాలన్నీ ఎన్డీయే ప్రభుత్వం నెరవేర్చింది. కడప ఉక్కు కర్మగారంపై మేకన్ సంస్థకు సరైన సమాచారం లేదు. ప్రత్యేక హోదా అనే అంశం చట్టంలో లేదని అన్నారు. ఏపీలో 175 అసెంబ్లీ స్ధానాల్లో , 25 పార్లమెంట్ స్ధానాల్లో పోటీ చేస్తాం. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ కీలక పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం ఏపీ అవినీతి కోరల్లో కూరుకుపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు కనుసన్నల్లో బరితెగించి అవినీతి చేస్తున్నారని అయన ఆరోపించారు.

Related Posts