- కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండు చేసిన కవిత
- ఏ కూటమి ఏర్పడినా...వార్ వన్ సైడే
విభజన సమస్యలను కేంద్ర ప్రభుత్వం త్వరగా పరిష్కరించాలని ఎంపీ కవిత డిమాండ్ చేశారు. సచివాలయంలో మీడియా ప్రతినిధులతో కాసేపు ముచ్చటించిన ఆమె.. పద్మ అవార్డుల విషయంలో రాష్ట్రానికి న్యాయం జరగలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. పసుపు మద్దతు ధరపై కేంద్రంపై సాధ్యమైనంత ఒత్తిడి తీసుకొస్తున్నట్లు స్పష్టం చేశారు. సచివాలయంలో మీడియా ప్రతినిధులతో కాసేపు ముచ్చటించిన ఆమె..కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్‌లోకి రావడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారని ఎంపీ కవిత చెప్పారు. వచ్చే ఎన్నికల్లో హరీశ్ పార్లమెంటుకి వెళతారన్నది ప్రచారమేనన్నారు.సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చబోమని స్వయంగా సీఎం చెప్పారని ఆమె పేర్కొన్నారు. . ఇక తాను ఎమ్మెల్యేగానా? లేక ఎంపీగా పోటీచేయాలా? అనేది పార్టీనే నిర్ణయిస్తుందని చెప్పారు.అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుదల జరుగుతుందని చెప్పలేమన్నారు. ఎన్నికలు ఎంతో దూరంలో లేదన్నారు. ఏ కూటమి ఏర్పడినా...వార్ వన్ సైడే అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న మంచి కార్యక్రమాలను విపక్షాలు కోర్టులకెళ్లి అడ్డుకుంటున్నాయని విమర్శించారు. ఇలాంటి ప్రతిపక్షాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు. మహిళలకు కేబినెట్‌లో స్థానం లేకపోవడం అంత పెద్ద విషయం కాదన్నారు. జేఏసీ ఛైర్మన్ ప్రొఫసర్ కోదండరామ్ పార్టీ పెడితే స్వాగతిస్తామని అన్నారు. అలాగే, సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు తెలంగాణలో పోటీ చేసే హక్కు ఉందని చెప్పారు. పవన్ కల్యాణ్ భవిష్యత్తును ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు.