YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జేసీకి ఈ సారి ఎదురుగాలే...

జేసీకి ఈ సారి ఎదురుగాలే...

జేసి బ్రదర్స్ అనంత‌పురంలో బలమైన నాయకులుగా పేరొందారు.  పార్టీ తో సంబంధం లేకుండా సొంత బలంతో గెలవగలిగే నాయకులుగా ఎదిగారు. అయితే నియోజక వర్గంలో జేసి బ్రదర్స్ తో మిగిలిన‌ ఎమ్మెల్యేలకు వివాదాలు తారా స్థాయికి చేరాయ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి అందుకే ఈ ఎన్నికల్లో జేసి బ్రదర్స్ విజయం అంత సుల‌భం కాద‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు. అస‌లు జెసి బ్ర‌ద‌ర్స్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేస్తారా అన్న అనుమానాలు త‌లెత్తే విధంగా వార్త‌లు వెలువ‌డుతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసేది లేద‌ని బ్ర‌ద‌ర్స్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించినా ఆ ప్ర‌క‌ట‌న‌ను కూడా ఎవ‌రూ న‌మ్మ‌టం లేదు. అదే స‌మ‌యంలో బ్ర‌ద‌ర్స్ త‌ర‌పున వాళ్ళ పుత్ర‌ర‌త్నాలు నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు. అయితే బ్ర‌ద‌ర్స్ కొడుకులు రాబోయే ఎన్నిక‌ల్లో పోటీ చేయాలంటే అందుకు చంద్ర‌బాబు అనుమ‌తి త‌ప్ప‌నిస‌రి. మ‌రోవైపు రాబోయే ఎన్నిక‌లు చంద్ర‌బాబుకు చాలా కీల‌కంగా మారాయి. 2019లో అధికారంలోకి రాక‌పోతే చంద్ర‌బాబుకే కాదు లోకేష్ తో పాటు చాలా మంది టిడిపి నేత‌ల‌కు ఇబ్బందులు త‌ప్ప‌వు. ఈ నేప‌ధ్యంలో జెసిల‌ను కాద‌ని వారి కొడుకుల‌కు టిక్కెట్లిచ్చి బాబు  ప్ర‌యోగం చేస్తార‌ని అనుకోన‌వ‌స‌రంలేదు. మ‌రోవైపు జెసిల వ్య‌వ‌హార‌శైలితిపై  న‌లు వైపులా వ్య‌తిరేక‌త రానురాను పెరిగిపోతోంది. గత మూడున్నరేళ్లుగా అనంతపురంలో రోడ్ల విస్తరణ విషయంలో జేసీ దివాకర్ రెడ్డి కి, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికీ మ‌ధ్య తీవ్ర స్థాయిలో వివాదం నడుస్తోంది. రోడ్ల విస్తరణ జరిపించాలని జేసీ ఎప్పుడు ప్రయత్నించినా.. ప్రభాకర్ చౌదరి.. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేల మద్దతుతో దానిని అడ్డుకుంటూ వస్తున్నారు. మ‌రోవైపు కమ్మ సామాజిక వర్గానికి తనకు పడటంలేదని ఓకానొక సందర్భంలో జేసీనే స్వయంగా చెప్పారు. తాడిపత్రిలో ప్రభాకర్ రెడ్డి పరిస్థితి కూడా  ఇలానే ఉంది. ఇక ఇప్ప‌టి విషయానికి వస్తే.. టీడీపీ నేత, ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ జూపూడి ప్రభాకర్ .. జేసీ బ్రదర్స్ పై తీవ్ర విమర్శలు చేశారు.  జేసీ బ్రదర్స్ సామంతరాజుల్లా వ్యవహరిస్తున్నారని దుమ్మెత్తిపోశారు. పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.  ఈ విషయంపై సీఎం చంద్రబాబుకి ఫిర్యాదు కూడా చేయనున్నట్లు చెప్పారు. ఏదిఏమైన‌ప్ప‌టికీ 2019 ఎన్నికలు మరెంతో దూరంలోలేవు. ఇటువంటి సమయంలో జేసీ బ్రదర్స్ కి వ్యతిరేకత పెరిగిపోయిన ప‌క్షంలో ఫలితాల్లో తేడాలొస్తాయ‌ని, అందుకే వారు జాగ్ర‌త్త ప‌డితే మంచిద‌ని ప‌లువురు సూచిస్తున్నారు. 

Related Posts