భారతదేశంలో బుధవారం సాయంత్రం సంపూర్ణ చంద్రగ్రహణం ప్రారంభమైంది. భారతదేశంలో సాయంత్రం4.21 గంటలకు సంపూర్ణ చంద్రగ్రహణం ప్రారంభమైంది. ఆకాశంలో చంద్రుడి అద్భుత దృశ్యాన్ని ప్రజలు వీక్షిస్తున్నారు. సాయంత్రం 6.25 నిమిషాలకు సంపూర్ణ చంద్రగ్రహణం కనిపిస్తుంది. సాయంత్రం 7.37 గంటల వరకు భారతదేశంలో చంద్రగ్రహణం దర్శనమిస్తుంది. సాయంత్రం 7.25 గంటల నుంచి చంద్రుడి పరిమాణం తగ్గుతూ వస్తుంది. భారత్‌లో సంపూర్ణ చంద్రగ్రహణం మాత్రం 5.25 గంటలకు ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల్లో ముందుగా విశాఖపట్నంలో తొలుత చంద్రగ్రహణం దర్శనమిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖలో చంద్రగ్రహణాన్ని వీక్షించడానికి పెద్ద యెత్తున గుమికూడారు. అరకులోయ పర్యటనకు వచ్చిన ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు దాన్ని వీక్షిస్తున్నారు. కోల్‌కతాలో సాయంత్రం 5.25 గంటలకు చంద్రగ్రహణం కనిపించింది. రోజూ కనిపించే కన్నా 30 శాతం పెద్దగా చంద్రుడు కనిపిస్తాడు. సూపర్ బ్లూ బ్లడ్ మూన్ ఒకేసారి కనిపిస్తుండంతో ఈ అద్భుత దృశ్యాన్ని జారిపోకూడదని ప్రజలు భావిస్తున్నారు. చంద్రగ్రహణం కారణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ఆలయాలను మూసివేశారు. రేపు గురువారం సంప్రోక్షణ తర్వాత ఆలయాల తలుపులు తెరుస్తారు.