- మళ్లీ 2037లో సూపర్, పెద్దగా చంద్రుడు కనిపిస్తాడు ..
- రేపు ఆలయాలు తెరుచుకుంటాయి
ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. సూపర్‌బ్లూబ్లడ్ మూన్‌ను ప్రజలు ఆసక్తిగా తిలకించారు. పశ్చిమ బెంగాల్, భువనేశ్వర్ రాష్ట్రాల్లో సూపర్‌బ్లూబ్లడ్ మూన్ కనిపించింది. సాయంత్రం 4.21 గంటల నుంచి రాత్రి 7.37 నిమిషాల వరకూ చంద్ర గ్రహణం వేళగా తెలిసింది. కోల్‌కతాలో సాయంత్రం 5.15 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల్లో విశాఖలో ముందుగా బ్లూ,బ్లడ్‌మూన్ కనిపించింది.
ఢిల్లీలో సాయంత్రం 5గంటల 53నిమిషాలకు, చెన్నైలో సాయంత్రం 6.04కు, ముంబైలో సాయంత్రం 6.27నిమిషాలకు గ్రహణం ప్రారంభమైంది. దేశం మొత్తం మీద చూస్తే.. సాయంత్రం 5.20 నిమిషాలకు సంపూర్ణ చంద్రగ్రహణం మొదలైంది. రోజూ కనిపించే దానికంటే 30శాతం మళ్లీ 2037లో సూపర్, పెద్దగా చంద్రుడు కనిపించనున్నాడు. 1982 తర్వాత ఒకేసారి బ్లూ, బ్లడ్, సూపర్ మూన్ కనిపించడం ఈరోజే కావడం విశేషం.బ్లూ, బ్లడ్ మూన్ కనిపించనుంది. ఇదిలా ఉంటే చంద్ర గ్రహణం కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలను మూసివేశారు. సంప్రోక్షణ తర్వాత మళ్లీ ఆలయాలు రేపు తెరుచుకోనున్నాయి.