అది సింగరేణి ప్రాంతం..డబ్బుకు కొదవ లేదు..దీంతో కార్పోరేట్ పాఠశాలల జోరు..దీంతో ప్రభుత్వ పాఠశాలలు ఒక్కొక్కటి మూత పడుతున్నపరిస్థితి..కాని ఇందుకు బిన్నంగా ఓ పాఠశాల విజయవంతంగా కొనసాగుతుంది. ప్రభుత్వ పాఠశాల జోరుకు రెండు చిన్న ప్రైవేట్ పాఠశాలలు మూతపడ్డాయంటే ఈ ప్రభుత్వ పాఠశాలలో ఎంతభాగా చదువు చెబుతున్నారో ఇట్టే అర్ధం అవుతుంది. ఇంగ్లీషు మీడియంపై ఉన్నఆసక్తితో కులీ పని చేసుకునే వ్యక్తి నుంచి ప్రతి ఒక్కరు తమ పిల్లలు ఇంగ్లీష్ గలగల మాట్లాడితే చూడాలని కోరుకుంటున్నారు. ఈ విషయాన్ని గమనించిన ప్రైవేట్ పాఠశాలలు పుట్టగొడుగుల్లా నెలకొల్పుతున్నారు. విధ్యార్థుల నుంచి వేల రూపాయలు ఫీజు ముక్కిపిండి వసూలు చేస్తు అంతంత మాత్రం చదువుకున్న యువతి, యువకులతో పాఠాలను చెప్పిస్తున్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాల చేరేందుకు ఎవ్వరు ఆసక్తి చూపకపోవడంతో పాఠశాలలు క్రమంగా మూతపడుతున్నాయి. తమ పాఠశాలను ఎలాగైన కాపాడుకోవాలని అనుకుని భావించిన మందమర్రి ఫిల్టర్‌బెడ్ ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు ఇన్నారెడ్డి వినుత్నంగా ఆలోచించాడు. అనుకున్నదే తడవుగా ఉన్న కొద్దిపాటి విద్యార్థుల తల్లిదండ్రులతో తీర్మాణం చేయించి ఆ కాపిని తీసుకుని అప్పటి జిల్లా కలెక్టర్ ఆహ్మద్‌బాబును కలిసి తమ పాఠశాల పరిస్థితిని వివరించారు. తమ ప్రాథమిక పాఠశాలలో ఆంగ్లమాధ్యమం ప్రారంభించేందుకు జిల్లా కలెక్టర్ సూచన ప్రాయంగా అనుమతి ఇవ్వడంతో 2014-15సం.లో రెండు నూతన గదులలో 1 నుంచి 3 వ తరగతి ఆంగ్లమాధ్యమంలో 27 మంది విద్యార్థులతో పాఠశాలను పున:ప్రారంభించారు. పాఠశాలప్రధానోపాధ్యాయుడు ఇన్నారెడ్డి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఇంటింటి తిరుగుతూ ప్రచారం నిర్వహించి తమ పాఠశాల గురించి వివరించారు. దీంతో మొదటి ఏడాదిలో 180 మంది విద్యార్థులు పాఠశాలలో చేరారు. విద్యార్థులకు ఆంగ్లమాధ్యామంలో భోధించడం, దాతల సహకారంతో సేకరించిన కంప్యూటర్‌తో విద్యార్థులకు విధ్యను అందించడం, సులవైన విధానంతో పాఠ్యాంశాలను భోధించడం వంటివి చేస్తు విద్యార్థులను వారి తల్లిదండ్రులను ఆకట్టుకున్నారు. కార్పోరేట్ పాఠశాలలకు దీటుగా ఇక్కడి విద్యార్థులకు నాణ్యమైన విద్యానందించడంతో ఈ ఏడాది 277 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ప్రస్తుతం పాఠశాలలో నలుగురు రెగ్యూలర్ ఉపాధ్యాయులు, మరో ఇద్దరు డిప్యూటేషన్‌పై, ఒకరు తాత్కలిక సిబ్బంది విధులు నిర్వహిస్తు విధ్యాబోధన చేస్తున్నారు. రెండేళ్ల క్రితం ఈ పాఠశాలను దత్తకు తీసుకున్న ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు. ఉన్నత విధ్యనభ్యసించిన ఇద్దరు యువతిలను, తాత్కలిక ఉపాధ్యాయులుగా నియమించి వారికి స్వయంగా వేతనాలు చెల్లిస్తూ విద్యార్థులను ఆంగ్ల మాధ్యమంలో విద్యార్థులకు విద్యనందిస్తూ ప్రోత్సహిస్తున్నారు. గదుల కొరత తీవ్రంగా ఉన్నప్పటికి ఉన్న గదులలో సర్దుకుంటూ విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇక్కడి పాఠశాల గురించి తెలుసుకున్న పలువురు పేద విద్యార్థులు ప్పైవేట్ పాఠశాలను వదిలి ప్రభుత్వ పాఠశాలలో చేరుతున్నాంటే ఎంత చక్కగా చదువు చెబుతున్నారో అర్ధం చేసుకోవచ్చు ఒక్క మందమర్రి మండలం నుంచే కాకుండా పక్కాసిపేట, నెన్నల మండలాల వంటి దూర ప్రాంతాల నుంచి విద్యార్థులు ఆటోలలో ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నారు. అంతేకాక కార్పోరేట్ పాఠశాలలో ఉండే విధంగా ప్రతి నెల పోషకులతో సమావేశాలు, ప్రతి వారం విద్యార్థులకు పరీక్షలు, వాటి ఫలితాలపై ఉపాధ్యాయులతో చర్ఛ వంటివి నిర్వహిస్తూ ప్రైవేట్ పాఠశాలకు దీటుగా విద్యనందిస్తున్నారు.ఈ పాఠశాల దెబ్బకు సమీపంలో రెండు ప్రైవేట్ పాఠశాలలు సైతం మూతపడ్డాయంటే పాఠశాలలో ఉపాధ్యాయులు ఎంత అంకితభావంతో విధులునిర్వహస్తున్నారో ఇట్టే తెలిసిపోతుంది. ఐదో తరగతి వరకు ఉన్న ఈ పాఠశాలను పది వరకు చేస్తూ, అదనపు గదులను నిర్మించాలని విద్యార్థులువారి తల్లిదండ్రులు కొరుతున్నారు.