గుంటూరు జిల్లా నిజాంపట్నం హార్బర్ లో అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు జెట్టిలోని రెండు వేట బోట్లు కాలిపోయాయి. అర్దరాత్రి సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో సుమారు 7౦ లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. వేటకు వెల్లి 8 గంటల సమయం లో బోట్స్ ను జెట్టి దగ్గర నిలిపారు.అయితే అర్దరాత్రి ఒక్కసారిగా రెండు బోట్స్ లో మంటలు చెలరేగాయి.ఘటన పై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసారు. ప్రమాదంలో భారి ఆస్తి నష్టంతో పాటు ఒక బోట్ లో ఉన్న 3 లక్షలు విలువ గల సరుకు పాడయ్యిపోయినట్లు సంబంధిత బాధితుడు తెలిపారు.ఇంత జరిగిన ఇప్పటి వరకు మత్స్యశాఖ అధికారులు పట్టించుకోలేదంటు బోటు యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మరో వైపు జెట్టి ప్రాంగణం లో గత ఆరు నెలల నుంచి కరెంట్ సమస్యలున్న అధికారులు మాత్రం పట్టించుకోవట్లేదంటు బోటు యూనియన్ ప్రెసిడెంట్ కన్నా శ్రీనివాసరావు మండిపడ్డారు.కరెంట్ సమస్య వల్ల రాత్రి సమయంలో సరుకు దించుకునేందు నానా అవస్తలు పడాల్సిన పరిస్టితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేసారు.ఈ ప్రమాదంలో నష్ట పోయిన బాధితులకు నష్ట పరిహారాన్ని ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.