- నేడో రేపో ఆర్టీసీ చైర్మన్‌గా నియామకపు ఉత్తర్వులు జారీ
- మొన్నటివరకు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ సవుర్ధత పట్టం
రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల భర్తీపై దృష్టిపెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముందుగా.. రాష్ట్ర రోడ్డురవాణా సంస్థ చైర్మగ్‌గా రాష్ట్ర ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ తాజా మాజీ చైర్మన్ జూపూడి ప్రభాకరరావును నియమించే అవకాశాలున్నాయి. ఇటీవలే ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పదవీకాలం పూర్తికావడంతో మళ్లీ జూపూడినే చైర్మన్‌గా కొనసాగించాలా..? లేదా ఆయనకు మరింత మంచి పదవిని ఇవ్వాలా అన్న భావనలో సీఎం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. కార్పొరేషన్ చైర్మన్‌గా ఎస్సీ ఫైనాన్స్ సంస్థ నుంచి పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేసి వందలాది మంది ఎస్సీ యువకులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించిన నేపథ్యంలో జూపూడికి తిరిగి ఎస్సీ కార్పొరేషన్ బాధ్యతలే అప్పగిస్తారన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇలాంటి తరుణంలో తాజాగా చంద్రబాబు తన సన్నిహితుల వద్ద ఈ విషయం ప్రస్తావిస్తూ.. పని చేయడంలో ఎలాంటి బెరుకు... వణుకు లేకుండా పారదర్శక పాలన చేస్తున్న జూపూడికి మరింత బాధ్యతలు పెంచాలని తాను భావిస్తున్నట్లు చెప్పడంతో ఈ విషయం బయటకు పొక్కింది. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని ఒడ్డున పడేయడానికి జూపూడి ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ కావడం మరింత దోహదపడుతుందని తాను భావిస్తున్నానని, అలాగే రాష్ట్రంలో దళితులకు ఒక పెద్ద సంస్థ బాధ్యతలు అప్పగించిన పేరు తెలుగుదేశంపార్టీకి వస్తుందని తాను అభిప్రాయపడుతున్నానని చెప్పినట్లు తెలిసింది. ఇప్పటికే ఆర్టీసీ సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, ఇటువంటి సమయంలో సమర్ధుడైన జూపూడికి ఆ పదవిని ఇస్తే... ఆర్టీసీని మళ్లీ తిరిగి లాభాల బాటలోకి తెస్తారన్న ఉద్దేశం తనకు ఉందని వ్యాఖ్యానించినట్లు సమాచారం.
వేరే పేర్లు కూడా...
ఇంతకుముందు ఈ పదవిని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, కరణం బలరామకృష్ణమూర్తిలలో ఎవరో ఒకరికి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని జోరుగా ప్రచారం సాగింది. అయితే నష్టాల్లో ఉన్న సంస్థను ఒడ్డున పడేయుడానికి వారి సామర్థ్యం సరిపోతుందా.. లేదా..? అనే విషయాన్ని బేరీజు వేసుకుని చివరకు జూపూడి పేరును స్వయంగా ముఖ్యమంత్రే ప్రతిపాదించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రెండేళ్లుగా ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఆయన మంచి ఫలితాలను సాధించారనే అభిప్రాయం కూడా పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. దీంతో ఆయనకు ఆర్టీసీ చైర్మన్ పదవిని ఇవ్వాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారని తెలుస్తోంది. పార్టీలోని అందరినీ ఈ విషయంలో ఏకాభిప్రాయానికి తీసుకొచ్చే బాధ్యతలను పార్టీ సీనియర్ నేత ఒకరికి చంద్రబాబు అప్పగించారని సమాచారం.
మాటకారికి ముకుతాడా..?
మరోవైపు పార్టీలో ఆర్టీసీ చైర్మన్ పదవిని ఆశిస్తున్న వారి ప్రచారం మరోలా ఉంది. సమర్థుడు, నిజాయితీపరుడుగా, పరిపాలనపై పట్టున్న జూపూడి ప్రభాకర్‌రావును టీడీపీ సరిగా వినియోగించుకోవడం లేదనే మాటను తెరమీదికి తెస్తున్నారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా విజయవంతంగా బాధ్యతలు నిర్వహించిన ఆయనను ఇపుడు ఆర్టీసీ చైర్మన్‌గా నియమిస్తే.. పార్టీకి వచ్చే లాభం ఏమిటన్నది వారి వాదన. జూపూడికి ఆర్టీసీ చైర్మన్ పదవి ఇస్తే.. పార్టీకి ఆయన సేవలు దూరం అవుతాయని అంటున్నారు. ఎస్సీ వర్గాలకు తగిన ప్రయోజనాలు అందించి, వారిని పార్టీైవెపు ఆకర్షించిన ఘనత జూపూడికే ద క్కిందని, ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో అలాంటి వ్యక్తిని ఆర్టీసీకి పరిమితం చేయడం వల్ల పార్టీకి ప్రయోజనం ఉంటుందా.. అనే విషయాన్ని పునఃపరిశీలించాలని వారు కోరుతున్నారు. దళితుల్లో నోరున్న, సమర్థత కలిగిన నేత అయిన జూపూడికి... ప్రజలతో అంతగా సత్సంబంధాలు లేని ఆర్టీసీ చైర్మన్ పదవి ఇస్తే ఆయన సేవలను పార్టీ పోగొట్టుకోవడమే అవుతుందని వారు చెబుతున్నారు.
అక్కడా విజయుమే
ఎస్సీ వర్గానికి చెందిన ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్‌కు ఇంతటి బరువు బాధ్యతలు అప్పగించడం కూడా ఒక విధంగా ముఖ్యమంత్రి సాహసమేనని, ఆయన అక్కడ కూడా విజయం సాధిస్తారని సీఎంకు విశ్వాసం ఉందని మరోవర్గం చెబుతోంది. ఇప్పటికే ఎస్సీల్లో కొన్ని వర్గాలను జూపూడి ఆకట్టుకున్నారని, ఇప్పుడు పార్టీ నిర్వహిస్తున్న ‘దళిత తేజం- తెలుగుదేశం’ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటూ ఆయా వర్గాలకు మరింత పార్టీని దగ్గర చేస్తున్నారని.. ఇలాంటి నేత సేవలను పార్టీ పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని, ఆయనకు తగిన పదవిని అప్పగించాలని చంద్రబాబు తన సన్నిహితుల వద్ద చెప్పినట్లు సమాచారం. ఇంతకాలం వైసీపీకి అండగా ఉన్న లక్షలాది మంది యువతీ యువకులను టీడీపీ వైపు ఆకర్షించడంలో జూపూడిది కీలకపాత్ర అని సీఎం వ్యాఖ్యానించడంతో ఆయునకు చంద్రబాబు వద్ద మంచి మార్కులు పడిపోయాయని తేలింది. అందుకే ఆయునకు మంచి పదవి ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. జూపూడికి సముచితమైన పదవిని ఇస్తే ఆసక్తితో పనిచేస్తారని, ఆయా వర్గాలకు పార్టీపై మరింత నమ్మకం పెరుగుతుందని సీఎం వ్యాఖ్యానించారని విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో రాష్ట్ర ఆర్టీసీ సంస్థ చైర్మన్‌గా జూపూడి ప్రభాకరరావు పేరు దాదాపుగా ఖరారైనట్లు సమాచారం. పార్టీ ప్రధానకార్యదర్శి, మంత్రి లోకేష్ అమెరికా పర్యటన ముగించుకొని తిరిగి అమరావతికి చేరిన తరువాత ఈ ఉత్తర్వులు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వైఎస్‌కు సన్నిహితుడు
సుదీర్ఘ కాలం పాటు దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉంటూ దళితుల సమస్యలపై ఉమ్మడి రాష్ట్రంలో పోరాటాలు సాగించిన జూపూడి ప్రభాకర రావు అంచలంచెలుగా పదవులను అలంకరించారు. వైఎస్ ఎమ్మెల్సీగా పదవీ బాధ్యతలు అప్పగించగా, ఆయన మరణానంతరం జరిగిన అనూహ్య పరిణామాల మధ్య జూపూడి టీడీపీలో చేరారు. పార్టీలో చేరిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయునకు రాష్ట్ర ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించారు. ఏ పార్టీలో పనిచేసినా.. దళితులను అభివృద్ధివైపు నడిపించాలన్నదే తన ఉద్దేశమని చెప్పే జూపూడి.. ఆ పదవులన్నింటికీ వన్నె తెచ్చారనే చెప్పాలి.