తెలంగాణ ప్రభుత్వంలో కొత్త పరిశ్రమలకు పెద్దపీట వేశారు. పరిశ్రమలు నెలకొల్పడం కాదు , ప్రజలకు హాని చేయని పరిశ్రమలకు పెద్దపీట వేస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం నాడు పాశమైలారం పారిశ్రామికవాడలో వ్యర్థజల శుద్ధి కేంద్రాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలుష్యకాసారం లేకుండా పరిశ్రమలు నడపాల్సిన అవసరం ఉందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో కొత్త పరిశ్రమలకు పెద్దపీట వేశామన్నారు. ఓఆర్ఆర్ బయటకు కాలుష్య కారక పరిశ్రమలను తరలించడమే కాకుండా వ్యర్థాలను శుద్ధి చేసే కేంద్రాలను నిర్మించాలనే తరహాలో పరిశ్రమలకు సూచిస్తున్నామన్నారు. ఇక్కడ గ్రౌండ్ వాటర్ను కలుషితం చేస్తున్న పరిశ్రమలున్నాయని, అలాంటి పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. పారిశ్రామికవాడలో హరితహారానికి పెద్దపీట వేయాలన్నారు. హైదరాబాద్ ఫార్మా సిటీ లో అంతర్జాతీయ ప్రమాణాలకు నిబంధనలకు అనుగుణంగా అన్ని సదుపాయాలు కల్పించి తరలిస్తాం. అలాగే,పాశమైలారం ఐడీయేలో ఐటీఐ ను మంజూరు చేసి నిర్మిస్తామన్నారు.స్థానికులతో మమేకమై సెమి స్కిల్ల్డ్, స్కిల్ల్డ్ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పింన్చే విధంగా పారిశ్రామిక వేత్తలు రూపకల్పన చేయాలిని అయన సూచించారు. పారిశ్రామిక వాడాలో గతంలో వెదజల్లే వ్యర్థ జలాలు, గాలి కాలుష్యం ను నిర్ములించే విధంగా చర్యలు తీసుకుంటాం. ఈ పారిశ్రామిక వాడ 1700 ఎకరాలు. ఇక్కడ పెద్ద గ్రీన్ బెల్ట్ అవసరం వుంది. దానికి పరిశ్రమలు ముందుకు రావాలి. ఆదర్శ పారిశ్రామిక వాడగా తీర్చిదిద్దేందుకు పరిశ్రమలు శ్రీకారం చుట్టాలని మంత్రి విజ్ఞప్తి చేసారు.