వార్తలు ఆంధ్ర ప్రదేశ్
ప్రఖ్యాత లీ క్వాన్ యూ యూనివర్సిటీలో పారిశ్రామిక దిగ్గజాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ భేటీలో "పెట్టుబడులకు గల ప్రబల అవకాశాలు-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభావవంతమైన ఆర్ధిక అభివృద్ధి" అనే అంశంపై చంద్రబాబు ప్రసంగించారు. ఈ యూనివర్సిటీ ఇప్పుడు అంతర్జాతీయ ఖ్యాతి పొందింది. పరిశోధనారంగంలో పేర్గాంచిన విశ్వవిద్యాలయం ఇదిఅని కొనియాడారు. సింగపూర్ దేశాన్ని గమనిస్తే ప్రతికూల పరిస్థితులను దాటి ప్రబల శక్తిగా ఎదిగి ప్రపంచ ఆర్ధిక కేంద్రంగా మారింది. ఆంధ్రప్రదేశ్ కూడా నాలుగు సంవత్సరాల క్రితం విభజన సమస్యను ఎదుర్కొంది. బాల్యావస్థలను ఇప్పుడిప్పుడే అధిగమిస్తోంది. సింగపూర్ మాకు మా రాజధాని కోసం బృహత్తర ప్రణాళికను సిద్ధం చేసి ఎంతో సహాయం పడిందని అయన అన్నారు. 2022 కల్లా ఏపీని దేశంలో మూడు అగ్రశ్రేణి రాష్ట్రాల్లో ఒకటిగా, 2029 నాటికి దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని నిర్దేశించుకున్నామని తెలిపారు. ప్రజల సంతృప్తి, సంతోషమే పరమావధిగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో ముందున్నానని సీఎం అన్నారు.
2029 నాటికి దేశంలో నెంబర్ వన్ రాష్ట్రం