వార్తలు సినిమా
రాముడిపై వివాదస్నదమయిన వ్యాఖ్యాలు చేసిన కత్తి మహేశ్ను సోలీసులు ఆరు నెలల పాటు నగర బహిష్కరణ చేశారు. సోమవారం నాడు తెలంగాణ డీజీపీ మహేందర్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ నగరంలో ఎవరైనా ఉండొచ్చు కానీ, శాంతి భద్రతలను రెచ్చగొట్టవద్దన్నారు. టీవీ ఛానెల్ను వేదికగా చేసుకుని కత్తి మహేశ్ పలు మార్లు భావ వ్యక్తీకరణ చేస్తున్నారన్నారు. కత్తి మహేశ్ వ్యాఖ్యలతో మెజారిటీ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారని పేర్కొన్నారు. సీటీ పోలీస్ యాక్ట్, నేరగాళ్ల నియంత్రణ చట్టం ప్రకారమే కత్తిపై నగర బహిష్కరణ వేటు వేశామని చెప్పారు. మహేష్ను చిత్తూరులో వదిలేశామని, వివాదాస్పద వ్యాఖ్యలు ప్రసారం చేసిన ఓ టీవీచానల్కు నోటీసులిచ్చామని ఆయన తెలిపారు. అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లను అప్రమత్తం చేశామని మహేందర్రెడ్డి తెలిపారు.సమాజంలో శాంతి భద్రతల భంగానికి దారి తీస్తున్నాయని, అందుకే కత్తిమహేశ్పై చర్యలు తీసుకున్నామన్నారు. కత్తి మహేశ్ను 6 నెలల పాటు నగర బహిష్కరణ చేయడం జరిగిందన్నారు. హైదరాబాద్లో ప్రవేశించడానికి ప్రయత్నిస్తే మూడేళ్ల జైలుశిక్ష పడుతుంది. ఇతరుల మనోభావాలు దెబ్బతీయకుండా అభిప్రాయాలు వ్యక్తీకరించాలన్నారు. గత నాలుగేళ్లుగా తెలంగాణలో శాంతిభద్రతలు బాగున్నాయని... ఇకపై కూడా రాష్ట్రం శాంతియుతంగానే ఉండాలని డీజీపీ తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకున్నవారు అవుతారని చెప్పారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇంత వరకు రాష్ట్రంలో ఎలాంటి చిన్న సంఘటనా జరగలేదని అన్నారు. శాంతిభద్రతల దృష్ట్యా తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు.
కత్తి మహేష్ పై నగర బహిష్కరణ