YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం

జరా సీజనల్ వ్యాధులతో భద్రం

జరా సీజనల్ వ్యాధులతో భద్రం
గరంలో వాతావరణం మార్పిడితో వైరల్ జ్వరాలు పంజా విసురుతున్నాయి.. నిత్యం వందల మంది ఓపీకి వస్తుండగా అందులో సగం మంది వైరల్ లక్షణాలతో బాధపడుతున్నారు. ప్రధానంగా జలుబు, జ్వరం, గొంతు నొప్పి, దగ్గు లక్షణాలతో బాధపడుతున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు ఈ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా వాతవరణ మార్పులతో అధిక శాతం మంది ఆసుపత్రుల్లో చేరుతున్నారు. వీరిలో చిన్నారుల సంఖ్య అధికంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.మున్ముందు వైరల్ జ్వరాల భారిన పడేవారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. సాధారణ చికిత్సతోనే వైరల్ జ్వరం తగ్గిపోతుందని వైద్యలు సూచిస్తున్నారు. విశ్రాంతితోపాటు నీళ్లు ఎక్కువగా తాగడం, వైద్యుల సూచనల మేరకు మందులు వాడితే 4 నుంచి 6 రోజుల్లో తగ్గిపోతుందంటున్నారు. దగ్గినా, తుమ్మినా చేతి రుమాలు అడ్డంగా పెట్టుకోవడం వల్ల ఇంట్లో కుటుంబ సభ్యులకు సోకకుండా జాగ్రత్త పడవచ్చు. వైరల్ జ్వరంతో బాధపడుతున్న వారు చిన్నపిల్లలకు ఎత్తుకోక పోవడం మంచిందని వైద్యులు సూచిస్తున్నారు. జ్వరం ఇతర లక్షణాలు ఐదురోజుల కంటే ఎక్కువగా ఉన్నట్లయితే నిర్లక్షం వహించకుండా వైద్యులను సంప్రదించాలి. వైరల్ జ్వరాలకు చాలా మంది వైద్యుల సూచనల మేరకు కాకుండా వారి ఇష్టానుసారంగా మందులు వాడుతారు. ఇది చాలా ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.గ్రేటర్ పరిధిలో మలేరియా కేసులు చాపకింద నీరులా నమోదవుతున్నాయి. గ్రేటర్ పరిధిలో ఈ ఏడాది ఇప్పటికే మలేరియా కేసులు 300లకు పైగానే నమోదైనట్లు తెలుస్తోంది. మలేరియాలో సీఎఫ్ (ప్లాస్మోడియం ఫాల్సీ పారమ్) కేసులతో పాటు, మలేరియా పివి (ప్లాస్మోడియం వైవాక్స్) కేసులు కూడా నమోదవుతుండటం ఆందోళన కల్గిస్తోంది. గతేడాది మలేరియా కేసులు సుమారు వేయి వరకు నమోదయ్యాయి. ఈ ఏడాది కూడా అదే తరహాలో కేసులు నమోదవుతుండటం ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. పారిశుద్ధం లోపించడంతోనే దోమలు విజృంభిస్తున్నాయి. దోమల నివారణకు ప్రభుత్వం లక్షల రూపాయాలు ఖర్చు చేస్తున్నప్పటికీ ప్రయోజనం కనిపించడంలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.

Related Posts