YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కాంగ్రెస్‌లో ఓబీసీ చిచ్చు..

కాంగ్రెస్‌లో ఓబీసీ చిచ్చు..

రో కొత్త దుకాణమెందుకు?

భగ్గుమన్న నేతలు.. రాజీనామాకు చిత్తరంజన్‌ సిద్ధం

కాంగ్రెస్‌లో ఓబీసీ చిచ్చు రాజుకుంది. పీసీసీ ఆధ్వర్యంలో ఓబీసీ సాధికారత కమిటీని నియమించడమే దీనికి కారణం. బీసీల కోసం టీఆర్‌ఎ్‌సకు దీటుగా ఏం చేయాలనే అంశంపై సమాలోచనలు జరిపేందుకు ఓబీసీ సాధికారత కమిటీని ఏర్పాటు చేశారు. అయితే పార్టీ అనుబంధంగా బీసీ సెల్‌ ఉండగా మరో కొత్త దుకాణం ఎందుకంటూ బీసీ నేతలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. బీసీ నేతల మధ్య ఐక్యతను దెబ్బతీసేందుకు పార్టీలోని అగ్రకుల నేతలు కుట్ర చేస్తున్నారని శివాలెత్తుతున్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన కమిటీ సాధించేది, దానివల్ల కలిగే ప్రయోజనం ఏంటని బీసీ నేతలు ప్రశ్నిస్తున్నారు. టికెట్ల కేటాయింపులో బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని అడిగినందుకే ఈ రకమైన చిచ్చు రేపేందుకు అగ్రవర్ణాల నాయకుడు కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా కాంగ్రె్‌సలోని బీసీ నేతలందరినీ ఒకే వేదికపైకి తేవాలనే ఉద్దేశంతో ఓ ఫోరంను ఏర్పాటు చేసేందుకు సమావేశం జరిగింది. బీసీలకు ప్రత్యేకంగా రిజర్వేషన్లు లేనందున.. ఎక్కువ సీట్లు, టికెట్లు సాధించడానికి ఈ కోర్‌ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. అగ్రకుల నేతలతో సమానంగా వ్యక్తిగతంగా ఇమేజ్‌ సంపాదించుకున్న పలువురు నేతలు తామెందుకు వెనుకబడిపోవాలనే ఉద్దేశంతోనే ఈ కోర్‌ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. కనీసం 50శాతం టికెట్లు దక్కించుకోవాలని భావించారు. ఈ ప్రయత్నానికి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. కోర్‌ కమిటీలో ప్రాధాన్యం లభించడంలేదని నేతలు ఆరోపణలు చేసుకోవడంతో ఆ ఫోరం నిర్వీర్యమైంది. దాని తర్వాత టీపీసీసీ బీసీ సెల్‌ చైర్మన్‌ చిత్తరంజన్‌దా్‌స నేతృత్వంలోనే తమకు న్యాయం జరుగుతుందని పార్టీ నేతలు భావించారు. తాజాగా బీసీ సెల్‌ను పక్కనబెట్టి ఓబీసీ సాధికారత కమిటీని ఏర్పాటు చేయడంతో చిచ్చు రాజుకుంది.

 సాధికారత కమిటీ ఏర్పాటుకు కారణమిదే!

రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు, తాయిలాలు ప్రకటిస్తూ బీసీలను ఆకర్షిస్తున్న నేపథ్యంలో ఆ వర్గం వారిని కాంగ్రెస్‌ వైపునకు తిప్పుకోవాలంటే ఏం చేయాలనే దానిపై ఓబీసీ సాధికరత కమిటీ సమాలోచనలు, సంప్రదింపులు జరుపుతుంది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌సీ కుంతియాతో బుధవారం జరిగిన ముఖాముఖి సమావేశంలో మెజారిటీ బీసీ నేతలు ఈ మేరకు ఆయనతో చర్చించారు. సీఎం స్థాయిలో బీసీల కోసం కాంగ్రెస్‌ ఏదైనా చేయాలంటే అధ్యయనం అవసరమని కుంతియా దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

సాధికారత కమిటీ చైర్మన్‌గా నాగయ్య

టి.నాగయ్య చైర్మన్‌గా, బి.మహేశ్‌కుమార్‌ గౌడ్‌ కన్వీనర్‌గా ఓబీసీ సాధికారత కమిటీని ఏర్పాటు చేస్తూ టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బుధవారం ప్రకటన విడుదల చేశారు. ఈ కమిటీలో మాజీ ఎంపీలు అంజన్‌కుమార్‌యాదవ్‌, మధుయాష్కిగౌడ్‌, ఎమ్మెల్సీ ఆకుల లలిత, మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు నేరెళ్ల శారద, మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్యగౌడ్‌, యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్‌కుమార్‌యాదవ్‌, దాసోజు శ్రావణ్‌ పి.వినయ్‌కుమార్‌, టి.నిరంజన్‌, ఆదం సంతోశ్‌కుమార్‌, క్యామ మల్లేశ్‌, ఇ.అనిల్‌కుమార్‌, ప్రేమ్‌లాల్‌, జి.సుజాత, కత్తి వెంకటస్వామి, రాజారాం యాదవ్‌, బండి నర్సాగౌడ్‌, అల్లం భాస్కర్‌, నగేశ్‌ ముదిరాజ్‌, ఇందిరా శోభన్‌లకు చోటు కల్పించారు. ఓబీసీ సాధికారత కమిటీ మొదటి సమావేశాన్ని ఈ నెల 6న గాంధీభవన్‌లో నిర్వహించనున్నారు. కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌.సి.కుంతియా ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.

 

Related Posts