తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు. ఈ నెల 17వ తేదీన జరగబోయే సాలకట్ల ఆణివారి ఆస్థానాన్ని పురస్కరించుకొని ఆలయ శుద్ది కార్యక్రమం నిర్వహించారు. వేకువ జామున సుప్రధాత సేవ అనంతరం మూలవిరాట్టు ను పట్టు పరదలతో పూర్తిగా కప్పేశారు. ఆనంద నిలయం, బంగారు వాకిలి, ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పూజ పాత్రలను అర్చకులు, ఆలయ సిబ్బంది శుభ్రపరచారు. శుద్ధి తర్వాత నామపు కొమ్ము,శ్రీ చూర్ణం, పచ్చకర్పూరం, గంధం పొడి, కుంకుమ,కిచిలి గడ్డలతో శాస్త్రోక్తంగా తయారు చేసిన సుగంథం వెధజల్లే పరిమళం అనే ద్రవ్యాని గోడల పై పూతగా పూసి అనంతరం శ్రీవారికి దూపదీప నైవేద్యాలు సమర్పిస్తారు. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కారణంగా అష్టదల పాదపద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. మధ్యాహ్నం 12 గంటలకు భక్తులను స్వామి వారి సర్వదర్శననికి అనుమతిస్తారు.