YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అనంత దీక్షకు ఎంపీలందరూ

అనంత దీక్షకు ఎంపీలందరూ
ఆంధ్రప్రదేశ్ లో వెనుకబడిన ప్రాంతాల అభివృద్దికి కేటాయించిన 350 కోట్ల రూపాయల నిధులను కేంద్రప్రభుత్వం తక్షణం విడుదలచేయాలని కోరుతూ ఈనెల 11వ తేదీన అనంతపురంలో నిర్వహించే దీక్షలో ఎంపిలు అంతా పాల్గొంటారని ఏలూరు ఎంపి మాగంటి బాబు చెప్పారు. స్థానిక రామచంద్రరావుపేటలోని ఎంపి క్యాంపు కార్యాలయంలో మంగళవారం పొగాకు రైతులు ఎంపిని కలిసి నాటుపొగాకుపై జిఎస్‌టి తొలగించాలని కేంద్రంపై వత్తిడి తీసుకురావాలని కోరారు. దీనిపై మాగంటి స్పందిస్తూ రాబోయే పార్లమెంటు వర్షాకాల సమావేశంలో విభజన చట్టంలోపొందుపర్చిన 18 అంశాలతోపాటు రాష్ట్రానికి రావాల్సిన పలు నిధులపై పార్లమెంటులోప్రస్తావించి స్థంభింపచేస్తామని అందులో నాటు పొగాకు రైతుల సమస్యలు కూడా ప్రస్తావిస్తానని చెప్పారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్దికి ఆంధ్రప్రదేశ్ కు కేటాయించి తిరిగి వెనుకకు తీసుకున్న 350 కోట్ల రూపాయల నిధులను తక్షణమే విడుదలచేయాలని కోరుతూ ఈనెల 11వ తేదీన అనంతపురంలో జరిగే బారీదీక్షలో తాను పాల్గొంటున్నానని బాబు చెప్పారు. కృష్ణ, పశ్చిమగోదావరి జిల్లాల్లో 12500 మంది నాటుపొగాకు రైతులు ఉన్నారని ప్రతియేటా నీరు అందుబాటులోలేని ప్రాంతాలలో 6 మిలియన్ టన్నుల నాటు పొగాకును ఉత్పత్తిచేస్తున్నామని, అయితే ఈపొగాకుపై జిఎస్‌టి బారం మోపడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, జిల్లా నాటుపొగాకు రైతుల సంఘం నాయకులు బలభద్ర వెంకటరామయ్య, యలమంచిలి నారాయణ రావు లు మాగంటి బాబు దృష్టికి తెచ్చారు. మనప్రాంతంలో పండే నాటుపొగాకు ద్వారా చుట్టలు చుట్టి వ్యాపారం చేసే వారిపై రూపాయి ఖరీదుచేసే చుట్టపై 4.17 రూపాయల జిఎస్‌టి పన్ను కేంద్రం విధిస్తోంద ని, అదేవిధంగా నాటు పొగాకుకు పుట్టు కు వేయిరూపాయలు జిఎస్‌టి పన్ను వేయడంవల్ల రైతాంగం ఎన్నోఇబ్బందులుపడుతున్నామని వారు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం 28 శాతం జిఎస్‌టి పన్ను కట్టమన్నా కడతామని, కాని సెస్ తొలగించాలని దీనిపై కేంద్రంతో చర్చించి రైతులకు న్యాయం చేయాలని రైతు నాయకులు తిరండి రమణారావు కోరారు. ఈకార్యక్రమంలో జిల్లా నాటు పొగాకు రైతుల నాయకులు సిహెచ్ మాధవరావు, తమ్మన పాండురంగారావు, చాగంటి రామారావు, తదితరులు పాల్గొన్నారు.

Related Posts