గతమూడు రోజుల నుంచి రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల గోదావరి నది ఉరకలు వేస్తుంది.దీనితో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. మూడు రోజుల నుంచి రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరదకు నీటి మట్టం పెరుగుతోంది. దీంతో భద్రాచలం వద్ద గోదావరి ఉరకలెత్తుతోంది. మూడు రోజుల క్రితం 9 అడుగులు ఉన్న గోదావరి నీటి మట్టం శనివారానికే 11 అడుగులకు చేరుకుంది. ఆదివారం సాయంత్రానికి 16 అడుగులు, సోమవారం రాత్రికి 20 అడుగులు దాటింది. ఇంకా నీటి మట్టం పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. దీంతో పాటు భద్రాచలం డివిజన్‌లోని చర్ల మండలంలోని తాలిపేరు వద్ద నీటి మట్టం పెరిగింది. తాలిపేరు పూర్తిస్థాయి సామర్ధ్యం 74 అడుగులకు నీరు చేరింది. ఇంకా పైనుంచి వరద నీరు వస్తుండటంతో వరద పెరిగితే మిగతా నీటిని కిందకు వదిలేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.