మూడున్నర్ర దశాబ్దాలుగా ఎలాంటి పరిస్థితుల్లోనైనా పార్టీ జెండా అంటి పెట్టుకొని ఉన్నా. పదేళ్లు చంద్రబాబుతో ఆయన సేవలో ఉన్నా. అయినా నన్ను నమ్మించి మోసం చేశారు. ఆరు సార్లు గెలిచిన నన్నే ఉమ్మడి రాష్ట్ర పదికోట్ల ప్రజల సాక్షిగా మోసం చేశారని టీడీపీ బహిషృత నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు.మంగళవారం నాడు అయన మీడియాతో మాట్లాడారు. చేయని తప్పుకు రాజకీయంగా నా గొంతుకోశారు. చాలా బాధాకరం, ఒక రకంగా మానసికంగా నన్ను హత్యచేశారని అన్నారు. రేపటితో 63 ఏళ్లు పూర్తిచేసుకొని 64 వ ఏట అడుగుపెడుతున్నా. దళితులంటే లెక్కలేని తనం, దళితులను, దళితనాయకులను చులకనగా చూడటం బాధాకరం. ఒక నాయకునిగా 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు ఇంత అవమానకరంగా దళితులను, బలహీనవర్గాలను అవమానకరంగా చూడటం చాలా దురదృష్టకరమని అన్నారు. అన్ని వర్గాలను అవమానపరిచే పద్దతి తీవ్రంగా ఖండిస్తున్నా. ఎన్టీ రామారావు ను ఏలా మానసికంగా చిత్రహింసలు గురిచేసి చంపారో, ఆయన శిష్యులు 20, 30 మందిని అలానే మనసికంగా చిత్రహింసలు పెట్టి చంపారని అయన ఆరోపించారు. ఇటీవల ముద్దుకృష్ణమనాయుడు కూడా అలానే చనిపోయాడు..ఇవాళ నేను కూడా మానసికంగా చనిపోయానని అన్నారు. ఇక దళితులు, బలహీనవర్గాలు చంద్రబాబు మాటలు నమ్మి మోసపోవద్దు. అందుకే నా 64 వ జన్మదినం రోజున దిక్కులేని వాడికి దేవుడే దిక్కని నా మనసిక క్షోభ చెప్పుకునేందుకే తిరుమల వెంకన్నను దర్శించుకుంటున్నానని అన్నారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు వ్యతిరేక రాజకీయ శక్తులన్నీ ఏకమై ఆ దుర్మార్గుడికి రాజకీయంగా బొందపెట్టాలని ఆ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటానని అయన వ్యాఖ్యానించారు.