రాముడిపై వివాదస్పద వ్యాఖ్యాలు చేసాడని కత్తి మహేశ్ పై చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ ధర్మాగ్ర యాత్రకు సంకల్పించిన స్వామి పరిపూర్ణానందను బుధవారం మూడున్నర గంటల సమయంలో తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీహిల్స్లో గృహ నిర్బంధంలో ఉన్న ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు కాకినాడలోని శ్రీపీఠానికి ప్రాంతానికి తరలించారని సమాచారం. ఈ రోజు తెల్లవారు జామున 4 గంటలకు గృహనిర్బంధంలో ఉన్న స్వామి పరిపూర్ణానంద నివాసంలోకి పోలీసులు ప్రవేశించారు. స్వామీజీని ప్రత్యేక వాహనంలో మీడియా కంటపడకుండా తరలించాడానికి పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేసారు. అంతకుముందుఅయనను హైదరాబాద్ నగర బహిష్కరణ చేస్తున్నట్లు నోటీసులు ఇచ్చారు.
గత ఏడాది నవంబర్ లో రాష్ట్రీయ హిందూసేన సమావేశంలో స్వామీజీ చేసిన ప్రసంగంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తు పోలీసులు నోటీసు ఇచ్చారు. మెదక్ జిల్లా నారాయణ్ ఖేడ్ లో జరిగిన రాష్ట్రీయ హిందూ సేన ఆవిర్భావ
సభలో స్వామీజీ ప్రసంగిస్తూ ముస్లింలకు , క్రైస్తవులకు మక్కా, జెరూసలెం వెళ్లేందుకు పెద్దమొత్తం ప్రభుత్వాలు పెద్దమొత్తంలో ప్రజాధనాన్ని సబ్సిడీలుగా ఇస్తున్నాయని ప్రశ్నించారని...అలాగే హిందువులు తమ పవిత్ర క్షేత్రాలకు వెళ్లాలంటే మాత్రం సర్ ఛార్జీల పేరుతో పన్నులు వసూలు చేస్తున్నారని వ్యాఖ్యానించారని పోలీసులు తెలిపారు. ఈ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని
పోలీసులు తమ రిపోర్టులో తెలిపారు. అలాగే 2 డిసెంబర్ 2017లో రామేశ్వరపల్లి గ్రామం, కామారెడ్డి జిల్లాలోనూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు పేర్కోన్నారు. ఈ సమావేశంలో మీకు నిజాం పాలన కావాలా? లేక ఛత్రపతి శివాజీ పాలన కావాలా అంటూ స్వామీజీ యువతను ప్రశ్నించడంపై పోలీసులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మొగల్ పాలకులు బాబర్ , గజనీ మహమ్మద్ , ఖిల్జీ, హుమాయున్ వంటి వారు దేశంలో
హిందువులపై ఎన్నో అరాచకాలు చేశారని..., అత్యాచారాలు, లూటీలు చేశారని ఎంతోమంది హిందువులను ముస్లిం పాలకులు చంపివేశారని స్వామీజీ తన ప్రసంగంలో పేర్కొన్నారని ఇవి అభ్యంతరకరంగా ఉన్నాయని అన్నారు. అలాగే ఈ తెలంగాణ భూమిలోనూ రజాకర్లు ఎన్నో ఘోరాలు చేశారని, ప్రజలపై ముఖ్యంగా హిందూ మహిళలపై దమనకాండను కొనసాగించారని అన్నారన్నారని ఇవి కూడా తమకు
అభ్యంతరకరంగా ఉన్నాయని పోలీసులు తెలిపారు. స్వామీజీ తెలంగాణలోని ప్రాంతాలు పట్టణాల పేర్లను సైతం మార్చాల్సిన అవసరం ఉందని స్వామీజీ అన్నారని పోలీసులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. నిజామాబాద్ , హైదరాబాద్ , సికింద్రాబాద్, ఆదిలాబాద్ , మహబూబ్ నగర్ , అలాగే నిజామాబాద్ పేరును దాని పూర్వనామం ఇందూరుగా పేరు మార్చాలని అన్నారని పోలీసులు అన్నారు. 2018లో మార్చి పదకోండున కరీంనగర్ లో నిర్వహించిన బహిరంగ సభలోనూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. స్వామీజీ చేసిన ఈ అభ్యంతరకర వ్యాఖ్యలపై సమాధానం జూబ్లీ హిల్స్ పోలీసులు స్వామీజీకి షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే స్వామీజీకి ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని స్వామి తరపు న్యాయవాది అంటున్నారు. నోటీసులు ఇచ్చిన 24 గంటల తర్వాత కూడా స్వామీజీ నుంచి ఎలాంటి సమాధానం రాలేదని అందుకే వారిని ఆరు నెలలపాటు హైదరాబాద్ నగరంలో ప్రవేశించకుండా నిషేదాజ్ఞలు విధిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆరు నెలల తర్వాత స్వామీజీ హైదరాబాద్ లో ప్రవేశించాలంటే కూడా ఆంక్షలు విధించారు. ఇకపై స్వామీజీ హైదరాబాద్ నగరంలో ప్రవేశించాలంటే ముందుగా పోలీసు అధికారులు అనుమతి తీసుకోవాలని, తాను నివసించే చిరునామా, తాను ఎంత కాలం అక్కడ నివాసం ఉంటున్నారో కూడా తెలుపాలని ఆంక్షలు విధించినట్లు చెప్పారు.
న్యాయం-ధర్మం నాకు రెండు కళ్లు: స్వామి పరిపూర్ణానంద
న్యాయం అడిగితే తనను బహిష్కరణ వేటు వేశారని దీనిపై ఎవరు ఆవేశాలకు లోనుకావోద్దని స్వామి పరిపూర్ణనంద పిలుపునిచ్చారు. శాంతియుతంగా ఉండాలని, రామనామ జపాన్ని కొనసాగించాలని కోరారు.
ఎప్పటికైనా గెలిచేది న్యాయం, ధర్మమేనని అన్నారు. హిందూ ధర్మంపై, హిందువుల మనోభావాలతో ఆటలు ఆడుకుంటున్నవారికి రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ది చెబుతారన్నారు. హిందూ ధర్మంపై దాడులు చేసే జాతివ్యతిరేక శక్తులపై తమ పోరాటం కొనసాగుతుందని స్వామీజీ చెప్పారు